Breaking News

Sunita Williams: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!

Published on Wed, 01/29/2025 - 16:22

గతేడాది జూన్‌ 14వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్లు భూమ్మీదకి ఎప్పుడు అడుగుపెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండటంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? అనే సందేహాలు సర్వత్రా లేవనెత్తాయి. అయితే వాటన్నింటికీ చెక్‌పెడుతూ గతంలో సునీతా తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్‌ తాజాగా తాను ఆ సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ.. బాంబు పేల్చింది. దీంతో ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా..? అనే సందేహం అందిరిలోనూ రేకెత్తింది. ఇంతకీ విలియమ్స్‌ ఏం చెప్పారు..? భవిష్యత్ మిషన్ల పరిస్థితి ఏంటీ అంటే..

సునీతా విలియమస్స్‌(Sunita Williams) ఏడు నెలలుగా అంతరిక్షంలోనే(space) ఉండిపోవడంతో నడక(Walk) ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండటంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్‌ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది అన్నట్లుగా ఉన్నాయి విలియమ్స్‌ మాటలు చూస్తే. 

నెలల తరబడి గురత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండటం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేదు, పడుకోలేదు, అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్‌గా భావించిన సునీతాకు అదికాస్తా ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. 

ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైనా.. వారితో టచ్‌లో ఉండేలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడతున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు కూడా పరీక్షగా మారింది. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల(Astronauts) కుటుంబ జీవితాన్నే గాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్‌ పరిశోధనల కోసం వ్యోమగాములకు త్యాగాలు తప్పవనే విషయాన్ని నొక్కి చెబుతోంది. 

అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. కాగా, మార్చి చివరలో లేదా ఏప్పిల్‌లో స్పేస్‌ఎక్స్ క్రూ-10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అలాగే ట్రంప్‌ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్‌ని కోరినట్లు సమాచారం. 

(చదవండి: ఆ ఇద్దరి కోసం ట్రంప్‌ సాయం అడిగారు: మస్క్‌)
 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)