Breaking News

ఈ సండే రుచికరమైన పొటాటో బైట్స్‌, పనీర్‌ టిక్కా టోస్ట్‌ చేసేద్దాం ఇలా..!

Published on Sun, 11/30/2025 - 17:09

పొటాటో బైట్స్‌
కావలసినవి:  బంగాళాదుంప గుజ్జు – ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు చొప్పున, పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్‌ చేసుకోవాలి), పుదీనా తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, మామిడికాయ పొడి – ఒక టీస్పూన్, మ్యాగీ మసాలా – ఒక టీస్పూన్‌ , కొత్తిమీర చట్నీ – కొద్దిగా, నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూన్, బిస్కట్లు – ఒక చిన్న ప్యాకెట్, కారప్పూస – కొద్దిగా, ఉప్పు – సరిపడా 
తయారీ: ముందుగా ఒక పాత్రలో బంగాళదుంప గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, మామిడికాయ పొడి, మ్యాగీ మసాలా, కొత్తిమీర చట్నీ, నిమ్మరసం ఇలా అన్నీ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు రెండేసి బిస్కట్స్‌ తీసుకుని వాటి మధ్యలో కొద్దికొద్దిగా ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి, రెండు బిస్కట్స్‌ అతుక్కునేలా, చిత్రంలో ఉన్న విధంగా నొక్కాలి. ఆ తర్వాత అంతా సమాంతరం అయ్యేలా చేసుకుని కారప్పూసలో దొర్లించాలి. అనంతరం టొమాటో సాస్, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే, ఆ బైట్స్‌ భలే రుచికరంగా ఉంటాయి.

పనీర్‌ టిక్కా టోస్ట్‌
కావలసినవి:  పనీర్‌ ముక్కలు – ఒక కప్పు
బ్రెడ్‌ స్లైసెస్‌ – 4 లేదా 5, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, నూనె – సరిపడా
చిల్లీ సాస్, టొమాటో సాస్‌ – కొద్దికొద్దిగా
క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (కాస్త పెద్దగా కట్‌ చేసుకోవాలి)
నూనె, చీజ్‌ తురుము – సరిపడా
తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి, పనీర్‌ ముక్కలకు బాగా పట్టించి, వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్‌ స్లైసెస్‌పైన చిల్లీ సాస్‌ కొద్దిగా, టొమాటో సాస్‌ కొద్దిగా పూసుకుని, ఆపైన నాలుగేసి పనీర్‌ ముక్కలను పరచుకోవాలి. అనంతరం ఒకవైపు క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ప్రతి పనీర్‌ ముక్కకు ఆనించి, పైన చీజ్‌ తురుము జల్లుకోవాలి. ఇప్పుడు వాటిని బేకింగ్‌ ట్రేలో పెట్టుకుని, ఓవెన్‌లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది.

స్పెషల్‌ గువావా
కావలసినవి: జామకాయ – ఒకటి (పెద్దది)
చాట్‌ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా – కొద్దికొద్దిగా, పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
చిక్కటి పాలు – కొద్దిగా (కాచి చల్లార్చినవి)
తయారీ: ముందుగా పెద్ద జామకాయను ఇరువైపులా కాస్త కట్‌ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి గుంత తీసి, జామకాయను గిన్నెలా తయారు చేసుకోవాలి. ఆ మధ్యలో తీసిన జామకాయ ముక్కల్లో పంచదార, గరంమసాలా వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకుని, పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు గిన్నెలా మార్చుకున్న జామకాయలో కారం, ఉప్పు జల్లి, ఆ గుంతలో ఈ జామ–పంచదార మిశ్రమాన్ని వేసుకుని నింపుకోవాలి. అనంతరం పైన చాట్‌ మసాలా జల్లుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పండ్లు ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)