Breaking News

వెరైటీగా రస్క్‌ గులాబ్‌ జామ్‌, క్యాబేజీ ఖీర్‌ ట్రై చేద్దాం ఇలా..!

Published on Sun, 06/29/2025 - 13:26

రస్క్‌ గులాబ్‌జామ్‌

కావలసినవి:  రస్క్‌ పౌడర్‌– ఒక కప్పు
మైదాపిండి– ఒక టేబుల్‌ స్పూన్‌
కొబ్బరి పాలు– తగినన్ని
పంచదార– అర కప్పు (పాకానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి)
ఏలకుల పొడి– కొద్దిగా, నూనె– సరిపడా

తయారీ: ముందుగా ఒక పాత్రలో రస్క్‌ పౌడర్, మైదాపిండి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దికొద్దిగా కొబ్బరి పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో పంచదార పాకం పెట్టుకుని, అందులో ఏలకుల పొడి వేసుకుని, దోరగా వేగిన ఉండలను అందులో వేసుకోవాలి. రెండు గంటలు కదలకుండా ఉంచి, చల్లారాక సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ముంబై క్యాబేజీ ఖీర్‌
కావలసినవి:  క్యాబేజీ తురుము– ఒక కప్పు
చిక్కటి పాలు– 4 కప్పులు
పంచదార– అర కప్పు పైనే
సేమియా పుల్లలు– 5 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి వీటిని వేసుకోవచ్చు, అయితే ముందుగా నేతిలో వేయించాలి)
నెయ్యి– 4 టేబుల్‌ స్పూన్లు పైనే
ఏలకుల పొడి – అర టీస్పూన్‌
డ్రై ఫ్రూట్స్‌ తురుము– కొద్దిగా (గార్నిష్‌ కోసం)

తయారీ: ముందుగా తురిమిన క్యాబేజీని కొద్దిగా నేతిలో వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మరో స్టవ్‌ మీద, మందపాటి గిన్నెలో పాలు పోసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించిన క్యాబేజీ తురుము, పంచదార, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్యలో సేమియా పుల్లలు, నెయ్యి వేసి తిప్పుతూ సుమారు 7 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుని, నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

మలేషియన్‌ కుయ్‌ కారా బెర్లౌక్‌
కావలసినవి:  చికెన్‌ కీమా– అర కప్పు (కారం, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు అన్నీ కొద్దికొద్దిగా కలిపి, 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి, అనంతరం నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)
మైదా పిండి– ఒక కప్పు, గుడ్లు– 4, పసుపు– ఒక టీ స్పూన్‌
కొబ్బరి పాలు– పావు కప్పు, నీళ్లు– సరిపడా
బేకింగ్‌ సోడా– ఒక టీ స్పూన్, ఉప్పు,నూనె– తగినంత
మసాలా, ఉప్పు, కారం కలిపి ఉడికించిన లేదా వేయించిన రొయ్యలు, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – గార్నిష్‌కి

తయారీ: ముందుగా మైదాపిండిలో పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు, గుడ్లు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ మైదా మిశ్రమాన్ని క్రీమీగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని  ఒక గంట పక్కన పెట్టుకుని, పొంగనాల ట్రేకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి, మైదా మిశ్రమంతో గుంతలన్నీ సగం వరకూ నింపుకోవాలి. 

ఇప్పుడు కొద్దికొద్దిగా కీమా మిశ్రమాన్ని అందులో వేసుకుని, పైన మళ్లీ మైదా మిశ్రమంతో ఫిల్‌ చేసుకుని, బేక్‌ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని, ఒక్కో మైదా–కీమా బైట్‌ మీద ఒక్కో రొయ్యను, కొన్ని కూరగాయ ముక్కలను వేసుకుని సర్వ్‌ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. 

(చదవండి: ది బెస్ట్‌ ఐస్‌ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్‌లకు చోటు..! నటి దీపికా పదుకొణె)

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)