మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!

Published on Sat, 03/22/2025 - 11:03

పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్‌లూ తాగించొచ్చు.

కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.

తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి; 

ఈ పేస్ట్‌లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.

పచ్చి మామిడి హల్వా
కావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి  పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలు

తయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.

మ్యాంగో బనానా షర్బత్‌
కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంత

తయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్‌ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి. వేసవిలో ఈ షర్బత్‌  శరీరాన్ని చల్లబరుస్తుంది. 

(చదవండి:

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)