Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!

Published on Sun, 05/04/2025 - 11:07

‘వేసవి వచ్చిందంటే మా ఇంట్లో రోజుకో యుద్ధం జరుగుతోంది సార్‌!’ అని చెప్పారో తండ్రి. ‘మొబైల్‌ తీసేస్తే మా పాప ఏడుస్తుంది సర్‌. గట్టిగా అరిచి చెప్పినా పట్టించుకోవడం లేదు. చివరకు కోపంతో ఒక దెబ్బ వేస్తేనే దారికొస్తుంది’ అని చెప్పారో తల్లి. ‘మా అబ్బాయి టెన్త్‌ క్లాస్‌కు వెళ్తున్నాడు సర్‌. చదవమంటే మొహం చిట్లిస్తున్నాడు. సమ్మర్‌ హాలిడేస్‌లో కూడా చదవాలా?’ అని గొడవపడుతున్నాడు’ అని మరో తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలున్న ప్రతి ఇంటిలోనూ ఇలాంటి పోరాటమే జరుగుతుంటుంది. పిల్లలను ఎలా కంట్రోల్‌ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలపట్టుకుంటారు. అలాంటివారి కోసమే ఈ ఆర్టికల్‌. ఈ వేసవిని అవకాశాల మార్గంగా, ఒక టర్నింగ్‌ పాయింట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 

ఇదేమీ పనిష్మెంట్‌ సీజన్‌ కాదు...
స్కూల్, కాలేజీ ఉన్నన్ని రోజులూ రోజూ ఉదయం ఆరు గంటలకే లేచి, సిద్ధమై, బస్సు పట్టుకుని వెళ్లి, పాఠాలు, పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టే పిల్లలకు వేసవి సెలవులు ఒక ఆటవిడుపులా కనిపిస్తాయి. తమకు నచ్చిన టైంలో నిద్ర లేవచ్చని, నచ్చిన ఆటలు ఆడుకోవచ్చని భావిస్తారు. పుస్తకాలు, పరీక్షల గొడవ ఉండదని ఊపిరి పీల్చుకుంటారు. 

మరోవైపు తల్లిదండ్రులు ఈ వేసవిలో పిల్లలకు ఏదైనా నేర్పించాలని ప్లాన్‌ చేస్తుంటారు. లేదా నెక్స్ట్‌ క్లాస్‌కు రెడీ చేయాలని భావిస్తుంటారు. అందుకు మొబైల్‌ ఫోన్‌ అడ్డుగా ఉందని, దాన్ని తీసేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది. ఒక సెలవు రోజు మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటే మీరెలా ఫీలవుతారో గుర్తుచేసుకోండి. మీ పిల్లలు కూడా అలాగే ఫీలవుతుంటారు. 

‘ఇవాళ్టి నుండి మొబైల్‌ తీసేస్తా’, ‘చదవకపోతే తినొద్దు’– ఇలాంటి మాటల వల్ల పిల్లల మెదడులో కార్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ పెరుగుతుంది. తల్లిదండ్రులపై కోపం, భయం, దూరం పెరుగుతాయి. తల్లిదండ్రులను సంతోషపెట్టేందుకే తాము బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా వయసు పెరిగినప్పటికీ వారు సెల్ప్‌ డౌట్‌లో కొట్టుకుంటుంటారు. నిజానికి పిల్లలు మొబైల్‌కు అతుక్కుపోయేది మెదడులో విడుదలయ్యే ‘డోపమైన్‌’ అనే హ్యాపీ కెమికల్‌ కోసమే. అది మొబైల్‌ ద్వారా కాకుండా సహజమార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించండి. 

వేసవిని విలువైన కాలంగా మార్చండి... 
ఒక వారం రోజులపాటు ఏ శిక్ష లేకుండా మీ బిడ్డ ప్రవర్తనను గమనించండి. పొద్దున్నే లేచే సమయం, స్క్రీన్‌ టైం, భోజన సమయం, బోర్‌ అవుతున్న సమయాలు గమనించి నోట్‌ చేసుకోండి. 

మొబైల్‌ తీసేయమంటే వాళ్లు ఎలా ఫీలవుతున్నారో అడిగి తెలుసుకోండి. ‘మొబైల్‌ కాకుండా నీకు ఆనందం కలిగించే విషయం ఏమిటి?’ అని అడిగి తెలుసుకోండి. వారి ఆసక్తిని ప్యాషన్‌గా మార్చుకునే మార్గం చూపించండి. 

ఈ వేసవిని మూడు జోన్‌లలో డిజైన్‌ చేయండి
లెర్నింగ్‌ జోన్‌: ఓ వారం రోజులు మొబైల్‌ ఫోన్‌ కాస్త పక్కన పెట్టి,జీవితానికి అవసరమైన వంట, ఫస్ట్‌ ఎయిడ్, డబ్బు వినియోగం గురించి బేసిక్స్‌ నేర్చుకునేలా ప్రోత్సహించండి. తమకు నచ్చిన పుస్తకాలు తెప్పించి, చదువుకునే అవకాశం కల్పించండి. మైండ్‌ గేమ్స్‌ తెప్పించి ఇవ్వండి. ఆటోమేటిగ్గా మొబైల్‌కు దూరం అవుతారు. 

క్రియేటివ్‌ జోన్‌: ఈ వేసవిని వారికి నచ్చింది నేర్చుకునే అవకాశంగా మార్చండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్, కోడింగ్, బ్లాగింగ్‌ లాంటిది ఏదైనా కావచ్చు. అలాగే గార్డెనింగ్, సైన్స్‌ ప్రయోగాలు, బాటిల్‌ ఆర్ట్‌ లాంటివి చేయడానికి ప్రోత్సహించండి. యూట్యూబ్‌లో వీడియోలు చూసి సైన్స్‌ ప్రయోగాలు చేయమనండి. తాము నేర్చుకున్న దాన్ని మీకు నేర్పమని చాలెంజ్‌ ఇవ్వండి. 

కనెక్షన్‌ జోన్‌: మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగుల్లో ఉంటారు. ఈ వేసవిని వారితో బంధాన్ని బలపరచుకునేందుకు ఉపయోగించండి. మీ చిన్ననాటి సంగతులు పంచుకోండి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, బాబాయి, అత్తలతో మీ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి. అలాగే వారి అనుభవాలను ఎలాంటి జడ్జ్‌ మెంట్‌ లేకుండా వినండి. ‘వాట్‌ ఐ లవ్‌ అబౌట్‌ అవర్‌ ఫ్యామిలీ’ స్క్రాప్‌బుక్‌ తయారు చేయమని చెప్పండి.  

(చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్‌ సీజన్‌..! ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలంటే..)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)