Breaking News

జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?

Published on Fri, 08/15/2025 - 10:09

అథర్వ వేదానికి అనుబంధమైనది కృష్ణోపనిషత్తు. ఈ రెండు శ్లోకాలు అందులోనివే:
అన్యోన్య విగ్రహం ధార్యం తవాఙ్గస్పర్శనాదిహ / శశ్వత్స్పర్శాయితాస్మాకం గృహ్ణీమోవతారాన్వయమ్‌.
రుద్రాదీనాం వచః శ్రుత్వా ప్రోవాచ భగవాన్స్వయమ్‌ /అఙ్గసఙ్గం కరిష్యామి భవద్వాక్యం కరోమ్యహమ్‌.


సర్వాంగ సుందరుడు, సచ్చిదానంద స్వరూపుడు, మహావిష్ణు అవతారము అయిన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం (ఆయన సౌందర్యానికి) ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరాముడితో ‘ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడివైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము’ అన్నారు. వారి మాటలకు శ్రీరాముడు ‘నా మరో అవతారమైన శ్రీకృష్ణావతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్నీ, అతి సన్నిహిత సామీప్యాన్నీ అనుభవించి ఆనందిస్తారు’ అని బదులిచ్చాడు. ‘అలాగా స్వామీ! అయితే మమ్ములను మా మరుజన్మలో గోపికలుగాను, గోపబాలురుగాను జన్మింపజేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగానూ, గోపబాలురుగానూ రూపాలు ధారణ చేయడం సమ్మతమే!’ అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారం తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ఈ స్నేహమయ ప్రార్థనను విన్న ఆదిపురుషుడైన భగవానుడు ‘మీ గాఢమైన కోరికను నేను తప్పక మన్నించి నెరవేరుస్తాను!’ అన్నాడు – అని పై శ్లోకాల భావం. పరమ పురుషుడు, భగవానుడు అయిన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో ‘మేము కృతార్థులమైనాము స్వామీ!’ అన్నారు. 

రామావతారంలో ఏకపత్నీవ్రతుడు అయిన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదితం. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మలి జన్మలో పొందడాన్ని  ‘జన్మాంతర సాఫల్యం’ అంటారు. రామావతారంలో మునిజనం కృష్ణావతారంలో గోపికలై జన్మించడం ద్వారా భగవంతునితో అత్యంత సన్నిహితమైన సాంగత్యం పొంది అత్యుత్తమమైన జన్మాంతర సాఫల్యాన్ని పొందారు.

– భట్టు వెంకటరావు

#

Tags : 1

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు