Breaking News

కేన్సర్‌లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..

Published on Tue, 12/03/2024 - 12:40

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్  బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్‌లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్‌ స్పాట్‌గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్‌ కణితికి సంబంధించిన డీఎన్‌ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్‌ ప్రొఫైలింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తుంది. 

రక్తంలో డీఎన్‌ఏ మిథైలేషన్‌ని గుర్తించడానికి  స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్‌ కట్టుబడి ఉంది. భారత్‌లో కేన్సర్‌ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. 

ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్‌ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్‌('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్‌ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. 

అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్‌తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్‌ని జయించేలా ముందస్తు కేన్సర్‌ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్‌ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్‌స్పాట్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.

(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ మాయం..!)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)