Rashmita Thapa: సింపుల్‌ సిగ్నేచర్‌

Published on Sun, 11/03/2024 - 08:30

రశ్మితా పుట్టి పెరిగిందంతా ముంబైలోనే! సినిమాలు అంటే పిచ్చి! వారానికో సినిమా చూసి అందులోని హీరోయిన్‌ స్టయిలింగ్‌ను కాపీ చేసేది. అలా గ్లామర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ మీదున్న ఆసక్తితో డిగ్రీ చదువుతుండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత గ్రహించింది తన అసలు ఆసక్తి స్టయిల్‌ని కాపీ చేయడంలో కాదు క్రియేట్‌ చేయడంలో అని! అందుకే చదువుతున్న డిగ్రీకి గుడ్‌ బై చెప్పి  ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో చేరింది. ఆ కోర్స్‌ పూర్తయిన తర్వాత పలు ఫ్యాషన్‌ డిజైనర్స్‌ దగ్గర పనిచేసింది. 

స్టయిలింగ్‌లో ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం కొంతమంది సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల వద్ద ఇంటర్న్‌గా చేరింది. ఆమె పరిశీలన, పనితీరుకు చాలామంది సెలబ్రిటీలు ఇంప్రెస్‌ అయ్యి, ఆమెను స్టయిలిస్ట్‌గా పెట్టుకున్నారు. వారిలో శ్రీలీల, రీతూ వర్మ, లావణ్యా త్రిపాఠీ, నేహా శెట్టీ, నిధీ అగర్వాల్, చాందినీ చౌదరి, రుహానా శర్మ, నభా నటేశ్, ఆకాంక్షా సింగ్, అనుపమా పరమేశ్వరన్, కీర్తీ సురేష్‌తో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, అవికా గోర్, సోనాల్‌ చౌహాన్‌ కూడా ఉన్నారు. 

రశ్మితా స్టయిలింగ్‌ మంత్ర.. సింపుల్‌ అండ్‌ కంఫర్ట్‌! దానివల్లే ఎందరో సెలబ్రిటీలకు ఆమె ఫేవరట్‌ స్టయిలిస్ట్‌ అయింది. క్యాజువల్‌ లుక్‌ నుంచి రెడ్‌ కార్పెట్‌ వాక్స్, కార్పొరేట్‌ ఈవెంట్స్, ఎండార్స్‌మెంట్స్, సినిమా ప్రమోషన్స్‌, ఫంక్షన్స్‌, పెళ్లిళ్ల దాకా.. సందర్భానికి తగ్గట్టు సెలబ్రిటీలకు స్టయిలింగ్‌ చేసి సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలబెడుతుంది. అందుకే ఆమెకు ఫిమేల్‌ సెలబ్రిటీలే కాదు మేల్‌ సెలబ్రిటీలూ ఫ్యాన్సే! వాళ్లలో అల్లు శిరీష్‌ ముందుంటాడు. తర్వాత విజయ్‌ దేవరకొండ. ఆ ఇద్దరికీ రశ్మితానే స్టయిలింగ్‌ చేస్తోంది. తన క్రియేటివ్‌ జీల్‌తో ఫ్యాషన్‌ వ్లాగ్స్‌ కూడా చేస్తూ సోషల్‌ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించింది. వీటితోపాటు అప్పుడప్పుడు మోడల్‌గానూ మెరుస్తోంది.   

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)