ఇక్కడి నుంచే సొసైటీ ఈక్వాలిటీ!

Published on Tue, 06/16/2026 - 00:38

స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌.. 
అబ్బాయిలు బ్యాట్‌ పట్టుకున్నారు.  ఒక అమ్మాయి ‘నేను కూడా ఆడతా’ అంది.  జవాబు ‘బాల్‌ అందించు చాలు’. 

క్లాస్‌ లీడర్‌ ఎలక్షన్‌.. 
‘అబ్బాయిలు ఎవరైనా నిలబడండి’ అంది టీచర్‌. ‘మేడమ్‌ నేను’ అన్న అమ్మాయికి నవ్వులు. 

ఇది 2026. 
అమ్మాయిలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. కానీ కొందరి ఆలోచనలు పాతగానే ఉన్నాయి. బడిలోనే ‘తేడా’ మొదలైతే రేపు సమాజంలో 
అది ‘వివక్ష’ అవుతుంది. సమభావనే సిసలైన చదువు.

కేస్‌ స్టడీ 1:   కెప్టెన్  కావ్య
కావ్యకి కబడ్డీ పిచ్చి. కానీ పీఈటీ సార్‌ ‘అమ్మాయిలు కబడ్డీ ఆడకూడదు, దెబ్బలు తగులుతాయి’ అని తేల్చేశాడు. కావ్య ఊరుకోలేదు. ప్రిన్సిపాల్‌కి లెటర్‌ రాసింది... ‘సార్, దెబ్బ తగిలితే డెటాల్‌ రాసుకుంటాను. కానీ ఆడకుండా ఆపితే అసలైన గాయం అవుతుంది’. ప్రిన్సిపాల్‌ దిగొచ్చాడు. స్కూల్‌లో మొదటిసారి ‘గర్ల్స్‌ కబడ్డీ టీం’ పుట్టింది. కావ్య కెప్టెన్ . ఆ టీం జిల్లా లెవెల్‌లో కప్‌ కొట్టింది. ఒక్క అమ్మాయి ‘ఎందుకు కాదు?’ అని అడిగితే, వందమంది అమ్మాయిలకు ‘ఆడొచ్చు’ అనే దారి దొరికింది.

కేస్‌ స్టడీ 2:   వంటగది వరుణ్‌
వరుణ్‌ వాళ్లమ్మ జాబ్‌ చేస్తుంది. ఒకరోజు అమ్మకి జ్వరం. 9వ తరగతి వరుణ్‌ స్టవ్‌ వెలిగించి చపాతీ చేశాడు. స్కూల్‌కి క్యారేజ్‌లో అదే తెచ్చాడు. ఫ్రెండ్స్‌ ఎగతాళి చేశారు... ‘ఏందిరా ఆడపిల్లలా వంట చేశావా?’. వరుణ్‌ తల దించుకోలేదు. ‘మా అమ్మ రోజూ నాకు అన్నం పెడుతున్నప్పుడు, నేను ఒక్కరోజు మా అమ్మకి ఎందుకు పెట్టకూడదు?’ అన్నాడు. క్లాస్‌ టీచర్‌ అది విని మరుసటి రోజు ‘లైఫ్‌ స్కిల్‌’ పీరియడ్‌ పెట్టింది. అబ్బాయిలతో ఉ΄్మా చేయించింది, అమ్మాయిలతో సైకిల్‌ టైర్‌కి పంక్చర్‌ వేయించింది. ఆ రోజు నుంచి ఆ క్లాస్‌లో ‘ఆడపని, మగపని’ అనే బోర్డ్‌ పీకేసి, ‘నా పని’ అనే బోర్డ్‌ పెట్టారు.

పిల్లలకు పెద్ద మాటలు కూడా అర్థమవుతాయి. క్లాస్‌లో సబ్జెక్ట్‌ చెబుతూనే మధ్యలో ‘జెండర్‌ సెన్సిటివిటీ’ అంటే ఏంటి? అని అడగండి. వాళ్లు ‘అంటే ఏంటో చెప్పండి టీచర్‌’ అంటారు. అప్పుడు ఇలా చెప్పాలి:

‘జెండర్‌ సెన్సిటివిటీ’ అంటే అబ్బాయిలూ అమ్మాయిలూ సమానమని గుండె లోతుల్లో నమ్మడం. అబ్బాయిలకు కొమ్ములు, అమ్మాయిలకు రెక్కలు విడిగా మొలవవని తెలుసుకోవడం. ఇద్దరికీ మెదడు ఒకటే, గుండె ఒకటే, కలలు కనే హక్కు ఒకటే అనే అవగాహన కలిగి ఉండటం.  

స్కూల్, ఇల్లు ఏం చేయాలి? 
EQUAL రూల్‌ పాటించాలి

→E- EXAMPLESమార్చండి
పుస్తకాల్లో ఇప్పటికీ ‘అమ్మ వంట చేస్తుంది, నాన్న ఆఫీస్‌కి వెళ్తాడు’ అని ఉంటుంది. దాన్ని చెరిపేయండి. ‘అమ్మ ఇస్రోలో సైంటిస్ట్‌... నాన్న పిల్లలకు క్యారేజ్‌ కడతాడు’ అని చెప్పండి. గోడ మీద ‘గుడ్‌ హ్యాబిట్స్‌’ చార్ట్‌లో అబ్బాయి మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు, అమ్మాయి డ్రిల్‌ మెషీన్‌ పట్టుకున్నట్టు బొమ్మలు పెట్టండి. పిల్లలు చూసేదే నమ్ముతారు.

Q- QUASTIONS అడగనివ్వండి
‘మేడమ్, అబ్బాయిలు బ్రైట్‌ కలర్స్‌ వేసుకోకూడదా? అమ్మాయిలు షార్ట్‌ హెయిర్‌ ఉంచుకోకూడదా?’ అని పిల్లలు అడిగితే ‘సిల్లీ క్వశ్చన్ ’ అని నోరు మూయించకండి. ‘నీ ఇష్టం. ఛాయిస్‌ నీది. సమాజం కోసం నటించక్కర్లేదు’ అని గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి. పిల్లల డౌట్‌ తీరితేనే రేపటి డిస్క్రిమినేషన్‌ పోతుంది. ప్రశ్నని చంపితే, ఆలోచనని చంపినట్టే.

U-UNIFORM పని
క్లాస్‌ లీడర్, డస్టర్‌ దులిపే డ్యూటీ, రంగు కాగితాలు అంటించడం, అసెంబ్లీలో మాట్లాడటం – అన్నీ లిస్ట్‌ రాసి చీటీలు తీయించండి.  పనులు అబ్బాయిలకు వచ్చినా అమ్మాయిలకు వచ్చినా చేయాలి. అమ్మాయి లీడర్‌ అయితే క్లాస్‌ ఇంకా సైలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ‘నేను తగ్గేదేలే’ అని ప్రూవ్‌ చేసుకోవాలనే కసి వాళ్లలో ఎక్కువ. ఆ కసే రేపు దేశాన్ని నడిపిస్తుంది.

A-ABUSEకి జీరో టాలరెన్స్
‘ఆడపిల్లలా ఏడుస్తావా?’, ‘అమ్మాయిగా ఉంటూ రౌడీ వేషమా?’ – ఈ మాటలు మీ నోటి నుంచి రాకుండా స్కూల్‌ గేట్‌ దగ్గరే చెక్‌ చేసుకోండి. టీచర్‌ అయినా, ఫ్రెండ్‌ అయినా, పేరెంట్‌ అయినా ఇలాంటి మాటలు అంటే స్టాఫ్‌ రూంలో వార్నింగ్, మళ్లీ అంటే ఫైన్ .

L-LEARN FORM KIDS
పిల్లలకి పుట్టుకతో బయాస్‌ ఉండదు. ఒకటవ క్లాస్‌ పాపకి పక్కన కేవలం అమ్మాయిలతో ఆడుకోవాలా లేదంటే అబ్బాయిలతో ఆడుకోవాలా అనేది ఉండదు. మనమే బుర్రలో పురుగు పెడతాం. పిల్లల్ని చూసి మనం ‘అన్ లెర్న్‌’ అవ్వాలి. వాళ్ల ప్రపంచంలో ‘మంచి మనిషి’, ‘చెడ్డ మనిషి’ తప్ప ‘ఆడ మనిషి’, ‘మగ మనిషి’ అనే తేడా లేదు. ఆ స్వచ్ఛతని మనం పాడుచేయకూడదు.

→ పేరెంట్స్‌కి స్పెషల్‌ నోట్‌
కొడుకు దెబ్బ తగిలి ఏడిస్తే ‘గట్టిగా ఉండరా, మగాడివి కదా’ అని కన్నీళ్లు ఆపకండి. ఏడవనివ్వండి. ఫీలింగ్స్‌కి జెండర్‌ అంటించకండి. కూతురికి సైకిల్‌ కొనిస్తే ‘వేగంగా తొక్కకు, పడిపోతావ్‌’ అని కాళ్లకి సంకెళ్లు వేయకండి. ‘హెల్మెట్‌ పెట్టుకో, నువ్వు గెలవగలవు’ అని రెక్కలు కట్టండి. కొడుకుకి బ్యాంక్‌ అకౌంట్‌తో పాటు పొయ్యి వెలిగించడం, కూతురికి వంటతో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం నేర్పండి.

→ చివరిగా...
బడి అంటే ‘మార్కుల ఫ్యాక్టరీ’ కాదు, ‘వ్యక్తిత్వాలు తయారయ్యే ఒడి’. ‘ఎవరు ఏమవ్వాలి’ అని మనం శాసనాలు రాయకూడదు, ‘ఏమైనా అవ్వగలరు’ అని శ్వాస ఇవ్వాలి. 

బడిగంట మోగింది. ఇక వివక్షకి చెల్లు. సమానత్వానికి స్వాగతం.
– కె.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)