అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు! ఎందుకంటే.

Published on Sat, 07/15/2023 - 13:20

మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం.

వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్‌ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు.

ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు.

ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.  

(చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?)


 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)