Breaking News

నిమోనియా.. హంగామా

Published on Thu, 11/12/2026 - 04:27

‘24 గంటలు గడిస్తే తప్ప ఏ సంగతీ చెప్పలేం’ అంటుంటాడు డాక్టర్‌ కళ్లద్దాలు తీస్తూ. నిజ జీవితంలో నిమోనియా ప్రమాదకరమైనదే కాని సినిమాల్లో దాని చుట్టూ క్రియేట్‌ చేసే డ్రామా అంత కంటే ఎక్కువ. దర్శకులు, రచయితల చేతిలో పడి నిమోనియా ఎన్నో ప్రేమకథలను కలిపింది, మరెన్నో కన్నీళ్లు పెట్టించింది. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం  సందర్భంగా సాహిత్యం, సినిమాల్లో నిమోనియా చేసిన హంగామాపై లుక్కేద్దాం!

సినిమా కథ సరిగ్గా అల్లకపోతే దానికి కూడా నిమోనియా వచ్చే అవకాశం ఉంది. అక్కినేని, సావిత్రి పోస్టర్ల మీద కనపడి ‘మా బాబు’ అనే టైటిల్‌ పెడితే వాళ్లిద్దరూ కలిసి నటించారనుకుంటారు జనం హాల్‌లోకి వెళుతూ. కాదు. వితంతువు అయిన సావిత్రి కుమారుడికి నిమోనియా. ఆ బాబు ట్రీట్‌మెంట్‌ కోసం డాక్టరైన అక్కినేని చుట్టూ తిరుగుతుంటుంది సావిత్రి. ఇలాంటి కథను జనం ఏం చూస్తారు? చూడరు. కాని నిమోనియా లేకపోతే ఈ కథ లేదు.

తెలుగు సినిమాల్లో డాక్టర్లు ఆ రోజుల్లో ఇంటికొచ్చి చూసేవారు. మిలట్రీ గౌను వేసుకున్న గుమ్మడి, జగ్గయ్య  ఇళ్లల్లో చిన్నపిల్లలకు నిమోనియా వస్తే డాక్టర్లు వచ్చి పరీక్షించి చూసేవారు. హీరోయిన్‌ వానలో తడిస్తే ఇంకేం లేదు. ఇంటిల్లిపాదీ ప్లస్‌ డాక్టర్‌ ఆమె మంచం దగ్గరే. ఇక కథను మలుపు తిప్పాలంటే నిమోనియా తీవ్రతను పెంచేసేవారు డైరెక్టర్లు. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉంటాడు పేషెంట్‌. డాక్టర్‌ లోపలి నుంచి బయటకు వచ్చి కళ్లద్దాలు తీశాడంటే పేషంట్‌ ఏమోగాని ప్రేక్షకులు చచ్చారన్నమాట. ‘24 గంటలు గడిస్తే తప్ప ఏ సంగతీ చెప్పలేము’ అనేవారు.

నిజజీవితంలో నిమోనియా అంటే ఊపిరితిత్తులకు సోకే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌. ఒకప్పుడు నిమోనియాను ‘వృద్ధుల స్నేహితుడు’ అనేవారట. వృద్ధులకు త్వరగా మరణం తెస్తుందనే భావన అది. కానీ నిమోనియా ఏ వయసులోనైనా తీవ్రంగా సోకుతుంది. పిల్లల్లో వేగంగా ఊపిరి, జ్వరం, దగ్గు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సరైన పోషణ, సకాలంలో చికిత్స ఉంటే సులభంగా బయటపడవచ్చు. అయితే పాతకాలంలో అనారోగ్యం అంటే నిమోనియా లేదా టి.బి.ని ఉపయోగించేవారు. రెండూ ఊపిరితిత్తులకు సంబంధించినవే. ‘వెలుగు నీడలు’లో అక్కినేని టి.బి. పేషెంట్‌గా కనిపించి‘కల కానిది విలువైనది’ అని బతుకు విలువ చె΄్తాడు.

క్లాసిక్‌ కథ ‘ది లాస్ట్‌ లీఫ్‌’... ఓ హెన్రీ ‘ది లాస్ట్‌ లీఫ్‌’ కథలో జాన్సీ అనే యువ చిత్రకారిణికి నిమోనియా వస్తుంది. ఆమె బతుకు మీద ఆశ వదిలేసుకుంటుంది. కిటికీ బయట తీగకున్న ఒక్కో ఆకు రాలుతుంటే తనకు జబ్బు ముదిరిపోతోందని భావిస్తుంది. చివరి ఆకు రాలితే తానూ చనిపోతానని నమ్ముతుంది. ఇది తెలిసిన పక్కింటి ముసలి చిత్రకారుడు బెర్మన్‌ తుఫాను రాత్రిలో గోడ మీద ఒక ఆకును చిత్రిస్తాడు. ఆ ఆకు చూసి జాన్సీ కోలుకుంటుంది. కానీ వానకు తడిసిన బెర్మన్‌కే నిమోనియా వచ్చి చనిపోతాడు. ఇక్కడ నిమోనియా కేవలం జబ్బు కాదు. ఒకరికి మరణం, మరొకరికి జీవితం.

పథేర్‌ పాంచాలి... కమర్షియల్‌ సినిమాలు నిమోనియా రొమాంటిక్‌ డ్రామాగా వాడుకుంటే సత్యజిత్‌ రే తన ‘పథేర్‌ పాంచాలి’లో వర్షంలో తడిసిన చిన్నారి దుర్గకు నిమోనియా సోకడాన్ని గుండెను పిండేసే వాస్తవికతతో చూపిస్తాడు. రైలు చూడటానికి వెళ్లి వానలో తడిసిన దుర్గ నిమోనియా బారిన పడుతుంది. మనిషికి పేదరికం సగం జబ్బు. దుర్గకు పౌష్టికాహారం లేదు. తిండి తినీ తినక బలహీనపడి వానలో తడవడం వల్ల జబ్బు బారిన పడింది. ఆ సంగతి ప్రేక్షకుడికి అర్థమయ్యాక ఆమెకు మంచి టానిక్‌ దొరికి ఉంటే బాగుండేది కదా అని బాధపడతాడు.

టైటానిక్‌ నిమోనియా... హాలీవుడ్‌లో కూడా నిమోనియా ఉంది. గ్యాంగ్‌స్టర్‌ చిత్రం ‘లాలెస్‌’లో తూటాలకు, కత్తిపోట్లకు కూడా చావకుండా బతికిన హీరో చివర్లో మంచు సరస్సులో పడటం వల్ల నిమోనియా సోకి ప్రాణాలు కోల్పోతాడు. ఇక యానిమేషన్‌ ప్రపంచంలో ‘ది సీక్రెట్‌ ఆఫ్‌ నిమ్‌’ కథంతా నిమోనియా బారిన పడిన తన చిన్నారి ఎలుక పిల్లను కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే సాహసం చుట్టూనే తిరుగుతుంది. జపనీస్‌ యానిమేషన్‌ షోలలో  ఏదైనా పాత్ర గట్టిగా దగ్గినా లేదా వర్షంలో తడిసినా అది కచ్చితంగా కథను మలుపు తిప్పే జబ్బుగా మారుతుందని ఫ్యాన్స్ సరదాగా ‘ఇన్ క్యూరబుల్‌ కాఫ్‌ ఆఫ్‌ డెత్‌’ అని పిలుచుకుంటారు. కేవలం కథల్లోనే కాదు రియల్‌ షూటింగ్‌లలోనూ నిమోనియా విలన్‌ వేషం వేసింది. 

1997లో వచ్చిన ‘టైటానిక్‌’ సినిమాలో నీళ్లలో రోజుల తరబడి షూటింగ్‌ చేయడం వల్ల హీరోయిన్‌ కేట్‌ విన్స్లెట్‌ నిజంగానే తీవ్రమైన నిమోనియా బారిన పడి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది!

సినిమాల్లో హీరోయిన్‌ తలపై తడిగుడ్డ వేసి, ఒక రాత్రి జాగారం చేస్తే నిమోనియా ఇట్టే మాయమైపోవచ్చు. కానీ నిజజీవితంలో చలికాలం మొదలైంది కాబట్టి సినిమా లెక్కలు నమ్ముకోకుండా కాస్త వెచ్చనిదుస్తులు వేసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం!
 

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)