స్త్రీ భావోద్వేగానికి దర్పణం ‘ఫస్ట్‌ నైట్‌’

Published on Fri, 07/10/2026 - 06:23

పురుషాధిక్య సమాజంలో సగటు మహిళకి స్వేచ్ఛ ఉందా? అంటే ఉంది కాని కొన్ని పరిమితులు, కొన్ని షరతులు వర్తిస్తాయి అని చెప్పాలి... అయితే నిబంధనలకు లోబడి ఉంటే అది స్వేచ్ఛ ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తే మాత్రం అందుకు సమాధానమిచ్చే గొంతులు తడి ఆరిపోతాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి.. నిన్నమొన్నటి దాకా పరిచయం లేని వ్యక్తి కట్టిన తాళి.. ఉన్నపళంగా ఎక్కడ లేని ఆందోళన, ఏదో తెలియని అశక్తత, ఎవరికీ వ్యక్తం చేయలేని ఆవేదన.. ఇది పెళ్లయిన ప్రతి మహిళ ఎదుర్కొనే అంతఃసంఘర్షణ.. అరేంజ్డ్‌ మ్యారేజెస్‌లో ఇదంతా కామనే కదా అని సులువుగా మాట్లాడేయడం కూడా సాధారణం.. కాని ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలను తన కథాంశంగా మార్చుకుని ‘ఫస్ట్‌ నైట్‌’ పేరుతో తెరకెక్కించాడు వరంగల్‌కు చెందిన యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ శ్రీనివాస్‌ అడ్లా. 

పరిచయం లేని వ్యక్తితో పెళ్లి జరిగిన తర్వాత తన జీవితాన్ని ఎలా ఊహించుకుందో చెప్పలేని ఓ సగటు మహిళ కథే ఈ ‘ఫస్ట్‌ నైట్‌’. 15 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ చిన్న సినిమాలో ఎన్నో భావోద్వేగాలు..పెళ్లి జరిగిన మొదటి రాత్రి నవవధువు అనుభవించే మానసిక సంఘర్షణను, భయాన్ని, సమాజం ఆమెపై మోపే అంచనాలను ఎంతో సున్నితంగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. భారతీయ నేపథ్యంలో రూపొందినప్పటికీ, ఇందులోని భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనుభవించే మానసిక క్షోభను సున్నితమైన కోణంలో చూపించాడు. అందుకే శ్రీనివాస్‌ రూపొందించిన ఈ లఘు చిత్రం ఇటీవలే లండన్‌ ఫిల్మ్‌ స్కూల్‌ నిర్వహించే షోకేస్‌ 2026కు ఎంపికై అంతర్జాతీయ వేదికపై పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే పలు సినిమా ఆఫర్లు అందుకున్నా, తను మాత్రం భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన మట్టి కథలకు పట్టం కట్టడమే ధ్యేయమని చెబుతున్నాడు శ్రీనివాస్‌ అడ్లా.

సున్నిత భావోద్వేగాల మీదే..
‘‘ చిన్నప్పటి నుంచి సినిమాలే నా ప్రపంచం. అయితే మా నాన్న సూచన వల్ల ఢిల్లీలో బీబీఏ, ఎల్‌ఎల్‌బీ చదివాను. కాని సినిమాల మీద ఆసక్తి తగ్గలేదు. అందుకే లండన్‌ ఫిల్మ్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేశా. అక్కడ ప్రతి బ్యాచ్‌లో రూపొందిన ఉత్తమ చిత్రాలనే షోకేస్‌లో ప్రదర్శిస్తారు. అందులో నేను రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘ఫస్ట్‌ నైట్‌’ షోకేస్‌కు ఎంపికవ్వడం చాలా సంతోషకరం. ఈ ప్రాసెస్‌లో పైన్‌వుడ్‌ స్టుడియోస్, కంపెనీ 3 వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ సంస్థలతో పనిచేసే అవకాశం లభించింది. అలాగే ఇంగ్లీష్, రష్యన్‌ భాషల్లో నేను నిర్మిస్తున్న షార్ట్‌ ఫిల్మ్‌ ‘బుబ్లిక్‌’లో ప్రముఖ రష్యన్‌ నటి గ్జేనియా ర΄్పోపోర్ట్‌ నటిస్తున్నారు. వచ్చే జనవరిలో లండన్‌లోని బీఎఫ్‌ఐలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం. భారతీయ మూలాలున్న చిత్రాలు, మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సున్నిత భావోద్వేగాల మీదే సినిమాలు తీయాలన్నది నా లక్ష్యం.’’

– శ్రీనివాస్‌ అడ్లా

– శ్రావణ్‌ జయ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)