Breaking News

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం

Published on Fri, 07/25/2025 - 09:30

కరీంనగర్‌కల్చరల్‌: శ్రావణం..సకల సౌభాగ్యాలు, సకల శుభాలు ప్రసాదించే మాసం. లక్ష్మీ కటాక్షం ఉంటే అన్నింటా అభివృద్ధి, అంతులేని సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాలక్ష్మి ప్రాణనాథుడు శ్రీమహావిషు్టవు జన్మనక్షత్రమైన శ్రావణం పేరుతో శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శని వారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. మంగళగౌరీ వ్రతం, నాగులపంచమి, భానుసప్తమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహజయంతి, వరలక్ష్మీవ్రతం, జంధ్యాలపౌర్ణమి, పొలాల అమావాస్య పండుగలు జరుపుకుంటారు 

ప్రకృతి మాసం 
ప్రకృతిమాసమైన శ్రావణమాసంలో వర్షరుతువు ప్రభావం వల్ల ఎక్కడ చూసిన జలకళ కనిపిస్తుంది. ప్రకృతి మాత నిండుగ పచ్చదనంతో పరవశించి పోతుంది. భూమిపై ఉన్న మలినాలు, క్రిములు, కీటకాలు, వర్షపు నీటికి కొట్టుకుపోయి  శుభ్రంగా కనిపిస్తోంది. చెట్లు పచ్చగా చూపరులకు కనువిందు చేస్తుంటాయి. పర్వదినాలతో పాటు నోములు, వత్రాలకు అనూకులమైన మాసం కావడటంతో మహిళలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. 

శివునికి ప్రతీకరమైన మాసం
శ్రావణ మాసంలో ప్రతీ సోమవారం శివునికి ప్రతీకరమైనది. శివ భక్తులు ఈ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు ఉపవాస దీక్ష ఉండి అభిషేకం, నమక చమక రుద్రాభిషేకం శివపురాణం, శివలింగానికి ఫల,పంచామృత,క్షీరాభిషేకాలు చేస్తారు.

సమస్త శుభకార్యాలు చేసుకోవచ్చు
ఆధ్యాత్మిక జీవనంలో విజ్ఞాన శాస్త్రం కలిసి ఉంటుంది. ప్రతీ వ్యక్తి శ్రావణమాసంలో హిందూ, వెదిక, సనాతన సంప్రదాయాన్ని, ఆచారాలు పాటిస్తే ఆధ్యాత్మిక, ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు. ఈ మాసంలో సమస్త శుభకార్యాలు జరుపుకోవచ్చు.
– నమిలికొండ రమణాచార్యులు, ప్రముఖ ఆగమశాస్త్ర పండితుడు

ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు 
పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్యోతినగర్‌ హనుమాన్‌ సంతోషిమాత ఆలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, మామిడి తోరణాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. మొదటి శ్రావణ శుక్రవారం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.  అలాగే చైతన్యపురి మహాశక్తి ఆలయం, నగునూరి దుర్గాభవానీ ఆలయాల్లో శ్రావణ మాసం ఏర్పాట్లు చేశారు.    

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)