Breaking News

ఆ పాట మధురం!

Published on Sat, 03/29/2025 - 15:59

ఆమె పేరు స్ఫూర్తిరావు.. 
పుట్టుకతో వచ్చిన గాత్రానికి దైవదత్తమైన సంగీతాన్ని చేర్చి రాణించిన కళాకారిణి! పదేళ్ల క్రితమే ‘సూపర్‌ సింగర్‌ జూనియర్‌ -4’ పోటీ విజేత!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విదుషీమణులు రంజని, గాయత్రీల శిష్యురాలు!
ఎన్నో చోట్ల కచేరీలు చేసింది... భగవంతుడికి భక్తిపూర్వకంగా నాలుగు రాగాలు ఆలాపించింది.
అలాంటి స్ఫూర్తి రావు .. భజనచేస్తూ వీధుల వెంబడి భిక్షాటన చేస్తున్న ఓ కళాకారుడి గొంతు విని... వచ్చిన పని వదిలేసి ఆతడి వెంట పరుగులు పెట్టడం.. 
శ్రీ వాదిరాజ తీర్థ విరచిత కళాకృతి ‘ఒందు బారి’ పాటలో అడిగి మరీ గొంతు కలపడం... 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు వేగంగా చక్కర్లు కొడుతోంది!
వారం రోజుల క్రితం... కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ దేవస్థానం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు స్ఫూర్తి రావు మాటల్లోనే...

‘‘ఉడుపి శ్రీకృష్ణుడి దివ్య దర్శనమైంది. జీవితపు ఈ మలుపులో ఓ స్పష్టత, దారి చూపమని ఆ దేవదేవుడిని కోరుకుంటున్న (కన్నీళ్లు ఎంతకీ ఆగకున్నా...) వేళ... మిట్టమధ్యాహ్నపు ఎండల్లో మఠం వద్దనే వీధుల్లో ఓ దుకాణం నీడలో ఓ భజన వినిపించింది. అతడి గాత్రం అద్భుతంగా ఉంది. గొంతు నిండా భక్తి. ఆగలేకపోయా. వారి వద్దకు కాళ్లు వడివడిగా నడిచాయి. అబ్బురంగా వారి పాట వింటూ ఉన్నా. శ్రీ వాదిరాజ తీర్థ విరచిత ‘ఒందు బారి’ పాటను వారు పాడుతున్న తీరుకు అచ్చెరుపొందా. కలిసి పాడొచ్చా? అని అడిగి మరీ వారితో గొంతు కలిపా. (స్టార్‌హీరోను చూసి మురిసిపోయే ఫ్యాన్‌ లా ఉంది నా పరిస్థితి. పాటలోని పదం కమలే అంటూ తలూపారు.)

ఈ అనుభవం నాకు లభించిన ఆశీర్వాదమే. నీ మనసేం చెబుతోందో దాన్నే పాటించమని ఆ దేవదేవుడే నాకు చెప్పినట్లు అయ్యింది. నీకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని వదిలేయవద్దని చెబుతూ... సంగీతంతో వచ్చే ఆనందం ఎంత అందమైందో గుర్తు చేసినట్లు అయ్యింది. ఈ ఘటన నా ఆత్మపై శాశ్వతంగా ముద్రేసుకుపోతుంది. జీవితాంతం దీన్ని కృతజ్ఞతతో మోస్తా. అంతేకాదు.. ఆ కళాకారుడితో గొంతు కలిపిన తరువాత రోజంతా సంతోషంతో పళ్లికిలిస్తూనే ఉన్నా. అదే రోజు సాయంత్రం మణిపాల్‌లో మా కాలేజీ మ్యూజిక్‌ ట్రిప్‌ కూడా అంతే అందంగా ముగిసింది.

ఈ ఘటన నా జ్ఞాపకాల్లో, గుండెలో శాశ్వతంగా రికార్డై పోయింది. కానీ.. మిత్రులు నా వెంట పరుగెత్తుకు వచ్చి ఏం జరుగుతోందో అన్న కుతూహలంతో అన్నింటినీ ఇలా కెమెరాలో బంధించినందుకు కృతజ్ఞురాలిని!!!

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు