Breaking News

నీ కుక్క సల్లగుండా..

Published on Mon, 04/14/2025 - 15:39

ఒక యజమాని, తన కుక్కను అర్థం చేసుకునేదాని కన్నా.. ఆ కుక్కే తన యజమానిని బాగా అర్థం చేసుకుంటుంది.. అన్నది ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి సూత్రీకరణ. ఆయన మాటలు అక్షరసత్యాలే. కానీ, ఇప్పుడు కాలం మారింది. కుక్కల యజమానుల ఆలోచన తీరూ మారింది.  కుక్కలు యజమానిని అర్థం చేసుకోవడానికంటే ఎక్కువగానే, పెట్ లవర్స్ కూడా తమ పెంపుడు శునకాల అవసరాలు, మనోభావాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే, ఈ వేసవిలో, వాతావరణం ఎలా ఉంటుంది? వేడిమి తీవ్రత ఎంతుంటుంది? ఎండ తీవ్రత నుంచి పెట్స్ కాపాడుకోవడం ఎలా..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇటువంటి పెట్ లవర్స్ కోసం.. ఈ పంచసూత్రాలు.

ఈ ఏడాది వేసవి తాపం మనుషులే తట్టుకోలేనంత ఉంటుందని వాతావరణ నిపుణులు తేల్చి చెప్పేశారు. వడదెబ్బలు తాకే వీలుంది కాబట్టి, జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరించారు. మనుషులం.. మనమైతే వీటిని పాటిస్తాం. మరి, పెంపుడు జంతువులను ఈ వేసవి తీవ్రత నుంచి కాపాడుకోవదం ఎలా?  వేసవి దెబ్బతకు.. కుక్కల్లో.. మరీ ముఖ్యంగా కాస్త వయసు మీరిన వాటిలో.. హృద్రోగం వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు డీహైడ్రేషన్ కూడా శునకాలకు సమస్యే. ఇన్ని చెప్పాం కదా అని బెంగ పడొద్దు. కింద చెప్పిన ఐదు పద్ధతులను పాటించండి. ఈ’ వేసవి, మీ పెంపుడు జంతువుల పాలిట వరంగా మారిపోతుంది.

1. ఈ వేసవి మొత్తం, మీ శునకాలను వీలైనంత వరకు, రోజులో ఓ రెండు మూడు సార్లు, చల్లటి, తాజా నీటితో తడుపుతూ ఉండండి. అలాగే, మీ ఇంట్లోను, పెరట్లోను, మీ శునకం తిరుగాడే ప్రదేశాలన్నింట్లోనూ చల్లటి నీళ్లు నింపిన పాత్రలను ఉంచండి. దీనివల్ల, మీ శునకాలకు దాహమేసినప్పుడల్లా నీటిని తాగగలుగుతాయి.  

2. ఎట్టి పరిస్థుత్లోనూ మీ కుక్కలను ఎండకు తిప్పకండి. మరీ ముఖ్యంగా మిట్టమధ్యాహ్నం ఎండకు అస్సలు బయటకు తీసుకెళ్లకండి. దీనికారణంగా వేడి పెరిగి, శునకాలు గుండెపోటుకు గురయ్యే వీలుంది. అలాగే, వాటి పాదాలు కందిపోయి.. నడిచేందుకు ఇబ్బంది కావచ్చు. ఎప్పుడూ ఉదయపు విహారానికే తీసుకెళ్లండి. సూర్యోదయం తర్వాత  బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినా, వీలైనంత వరకు నీడపట్టునే నడిపించండి.

3.  ఈ వేసవిలో, మీ శునకానికి అనవసర వ్యాయామాలు వద్దు. వాటిని చక్కగా విశ్రాంతి తీసుకోనివ్వండి. వ్యాయామాలకు బదులుగా, వాటిని బ్రెయిన్ గేమ్స్‌తో బిజీగా ఉంచండి. 

4. శునకాలను కారులో తీసుకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడూ.. దాన్ని ఒంటరిగా కారులో వదిలి వెళ్లకండి. లోపలి ఉష్ణోగ్రతలు.. శునకపు శారీరక వేడిని క్షణాల్లో బాగా పెంచే వీలుంది. తగినంత గాలి, వెలుతురు అందేలా చూడండి. వెలుతురు అన్నాం  కదా అని.. ఎండ తగిలేలా ఉంచకండి. 

5. ఈ వేసవిలో, శునకానికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుండి కింద పడిపోవడం, భారమైన శ్వాస, దగ్గు, కడుపు ఉబ్బిపోవడం,  విపరీతంగా వాంతులు చేసుకోవడం, బాగా బలహీనపడిపోవడం, తల ఊపుతుండడం, జ్వరం, ముందరి పాదాలపై నడవలేక పోవడం, ఆహారాన్ని సరిగా తీసుకోలేక పోవడం లాంటివి మీ శునకానికి గుండెనొప్పిని సూచించే లక్షణాలు.. ఈ లక్షణాలను గుర్తించగానే, మీ శునకాన్ని, చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లండి. చల్లటి తాజా నీళ్లతో వాటిని తడుపుతూ ఉండండి. కొద్దికొద్దిగా నీళ్లు తాగించండి. పరిస్థితి తీవ్రతను బట్టి, మీ శునకాన్ని తక్షణమే పశువైద్యుడి వద్దకు తీసుకువెళ్లండి.  సంప్రదించండి.
- పి. విజయ్‌ కుమార్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)