ఆషాఢ మాసం.. పుట్టింటికి కొత్త కోడళ్లు..

Published on Wed, 07/15/2026 - 13:40

అన్ని తెలుగు నెలలతో పోలిస్తే ఆషాఢ మాసానికి ప్రత్యేకత ఉంది. ఈనెల ప్రారంభం కాగానే గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ఊళ్లన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారుతాయి. ప్రధానంగా గ్రామదేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఊళ్లను, చేను చెలకలను, పాడిపంటలను, పిల్లాజెల్లాను కాపాడే ఆ అమ్మలకు ఆషాఢంలో బోనాలు పెట్టే ఆనవాయితీ తెలంగాణకే ప్రత్యేకం. బోనాలజాతరలు, కుటుంబాల కలయికలు, కొత్త కోడళ్ల పుట్టింటి ప్రయాణాలతో ఈ మాసమంతా ప్రత్యేకత సంతరించుకుంటుంది. ప్రధానంగా మహిళలకు ఆషాఢం అంటే చాలా ఇష్టం. నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా కథనం.                                 

ఆషాఢం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బోనాలు. ఊరుఊరంతా కలిసి నెత్తిన బోనం కుండలతో గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్తారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఊరపండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు కట్టడి చేయడం, అందరూ కలిసి బోనాలు పోయడం, వనభోజనాలకు వెళ్లడం.. ఇలా ఈ మాసమంతా సందడి కొనసాగుతూనే ఉంటుంది. జిల్లాలో ఒక్కోవారం కులాల వారీగా బోనాలు పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సీజన్‌లో వ్రతాలు, పూజలూ చేస్తుంటారు. ప్రధానంగా మహిళలు మంగళగౌరీ వ్రతాలు, అమ్మవారి పూజలు నిర్వహిస్తారు.  

శుభకార్యాలకు విరామం..
‘ఏం ఆషాఢం పెళ్లి కొడుకా..’ అంటూ సరదాగా ఆటపట్టిస్తుంటారు. కానీ ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ మాసం ఓ రకంగా శుభకార్యాలకు విరామంగా చెబుతుంటారు. పెళ్లిళ్ల సందడి తగ్గినా, ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. జిల్లాలో పోచమ్మ, మహాలక్ష్మమ్మ, మైస మ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ తదితర గ్రామదేవతల ఆలయాల్లో బోనాల జాతరలు నిర్వహిస్తారు. కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఆఫర్లు..
‘ఆషాఢం ఆఫర్‌..’ అంటూ ఇప్పటికే వస్త్రదుకాణాల ప్రచారం హోరెత్తుతోంది. ఈ సీజన్‌ అంతా దాదాపు మహిళలదే. ‘ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ..’ అంటూ దుకాణాలూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. గోరింటాకు, పూలు, పూజా సామగ్రి, గాజులు, అలంకరణ వస్తువుల విక్రయాలు ఈ నెలలో పెరుగుతాయి. ఆషాఢం కేవలం ఒక మా సం మాత్రమే కాదు. కుటుంబ బంధాలను మరింత దగ్గర చేసే, సంప్రదాయాలను గుర్తుచేసే, భక్తి భా వం పెంపొందించే వేడుకల సమాహారం. పాత ఆచారాలను కొత్తతరం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ప్రత్యేక మాసం.

పుట్టింటికి కొత్త కోడళ్లు..
ఈ మాసం ప్రారంభం కాగానే కొత్తగా వివాహమైన బిడ్డలను పుట్టింటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో అత్తవారింటి కంటే పుట్టింట్లోనే ఎక్కువ రోజులు గడపడం సంప్రదాయంగా భావిస్తారు.

ఆధ్యాత్మికతకు ఆషాఢం ఆలవాలం..
హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో శుభకార్యాల కంటే దైవారాధన, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గ్రామదేవతల జాతరలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
– దోముడాల ప్రవీణ్‌శర్మ, నిర్మల్‌  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)