Breaking News

Tangirala Venkata Subbarao తొలితరం జానపథికుడు

Published on Wed, 02/05/2025 - 12:33

జానపద సాహిత్యం కోసం అనంతమైన కృషి చేసినవారు తంగిరాల వెంకట సుబ్బారావు. ఆ సాహిత్యాన్ని సేకరించి, విశ్లేషించి, వేలాది పుటల గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. ‘తెలుగు వీరగాథా కవిత్వం’పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకొన్నారు.  తెలుగులోని వీరగాథా వైశిష్ట్యాన్ని లోకానికి చాటడంలోతంగిరాల సఫలీకృతులైనారు. ఈ సిద్ధాంత గ్రంథంలో వీరగాథల పుట్టుపూర్వోత్త రాలు, వీరగాథా విభజన, శక్తి కథాచక్రం, పలనాటి వీర కథా చక్రం, కాటమరాజు కథాచక్రం, బొబ్బిలి వరుస కథలు, పదాలు, జంగం కథలు, లఘు వీర గాథలు, వీర గాథానుకరణాలు, వీరగాథలో రసం, భాష, ఛందస్సు, వీరగాథల వైశిష్ట్యం వంటి పరిశోధనా విషయాలను కూలంకషంగా చర్చించి వివరించారు. 

తంగిరాల ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే పెద్ద పుస్త కాన్ని ప్రచురించారు. ఇందులో భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర పోరాట వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథల్ని సవివరంగా పరిశీలించి తెలుగు వారికి అందించారు. అలాగే రేనాటి సూర్య చంద్రులు రెండవ సంపుటాన్ని ప్రచురించి అందులో రాయలసీమ దాన కర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి సాహిత్యాన్ని విడమరచి చెప్పారు. 

 చదవండి: Aga Khan : ప్రముఖ ఆధ్యాత్మికనేత, దాత ఆగా ఖాన్ కన్నుమూత

‘చైతన్య కవిత’ అనే పత్రికను స్థాపించి ఎన్నో ఏళ్ళు దానికి సంపాదకుడిగా పని చేశారు. ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ గ్రంథానికి కూడా సంపాదకత్వం వహించారు. రంగ నాథ రామాయణం, సుమతి శతకాలను తంగిరాలతో కలిసి కొంతమంది ఆంగ్లంలోకి అనువదించారు. ‘అంకమ్మ కథలు’ పేరుతో శక్తి కథాచక్రాన్ని ప్రచురించారు. వంద లాది పరిశోధనా వ్యాసాలను రచించారు.
తంగిరాల చేసిన సేవలకు గాను 2025 జన వరి 4న ఆయనకు ‘అజో విభోకందాళం ఫౌండేషన్‌ జీవిత సాఫల్య పురస్కారం’ పొందారు. ఇది జరిగిన ఇరవై ఒకటో రోజే (జనవరి 25) ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో జానపద సాహిత్యం ఉన్నన్నినాళ్లూ ఆచార్య తంగిరాల జీవించే ఉంటారు.

– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ‘ ఏపీ తెలుగు అకాడమీ మాజీ సంచాలకుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)