Breaking News

గ్రానీస్‌ వర్క్‌... గ్రాండ్‌గా!

Published on Thu, 02/20/2025 - 04:44

ఏడుపదుల వయసు దాటాక ఇంక చేసేదేముంది అని చాలామందిలో ఒక నిరుత్సాహపూరితమైన అభి్రపాయం ఉంటుంది. కానీ, చేయాలనుకున్న పనిని చేసి చూపించాలనుకునేవారికి వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్నారు ఈ బామ్మలు. కుటుంబ జీవనంలో గృహిణిగా, తల్లిగా బాధ్యతలు అన్నీ నిర్వర్తించాక తమకంటూ ఉన్న హాబీలు ఏవైనా ఉంటే వాటిని కొనసాగిస్తుంటారు కొందరు. హాబీనే వ్యాపారంగా మార్చుకొని ఏడు పదులు దాటిన వయసులోనూ 
సంపాదనపరులుగా మారినవారి నుంచి మనమూ స్ఫూర్తిని పొందుదాం.

పద్మ పరిఖా ఏడుపదులు దాటి రెండు దశాబ్దాలు అయ్యింది. సరదాగా నేర్చుకున్న క్రోషెట్‌ అల్లికలతో తన ఇంట్లో పిల్లలకు డ్రెస్సులు రూపొందించేది. కొన్ని రకాల షో పీసులను అల్లికతో అందంగా తయారు చేసేది. పదేళ్ల క్రితం ఆమె మనమరాలు బామ్మ వర్క్‌కు ఆదరణ కల్పించాలనుకుంది. ఆమె ్రపోత్సాహంతో పి.బి. హ్యాండ్‌మేడ్‌.ఔట్‌లెట్‌.కామ్‌ప్రారంభించింది. దీని ద్వారా వెయ్యిమంది వినియోగదారులకు పద్మ తన ఉత్పత్తులను అందజేస్తోంది. క్రోషెట్‌ ఉత్పత్తులను పది దేశాలకు ఎగుమతి చేసి, చేతినిండా సంపాదించడమే కాదు... సత్కారాలు పొందుతూ ‘స్వీయ సంపాదన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’ అని వేదికల మీద గర్వంగా చెబుతుంది ఈ గుజరాతీ వాసి పద్మ పరిఖా.

ఆశాపురి 50 ఏళ్లుగా స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లుతోంది. కుటుంబ సభ్యులకే పరిమితమైన ఆమె తన కళను విజయవంతమైన బిజినెస్‌గా మార్చుకుంది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ అల్లికల వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ తను నివసించే ఢిల్లీలోనే పదహారు మంది ఉద్యోగులను కూడా నియమించుకుంది.

శీలా బజాజ్‌ 80 ఏళ్లు. ఢిల్లీ వాసి. ఆరేళ్ల క్రితం బిజినెస్‌ ఉమన్‌గా మారింది. మనవలు, మనవరాళ్ల కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లే శీలా కరోనా సమయంలో తన అభిరుచిని విస్తృతం చేసింది. తన మొదటి సంపాదన 350 రూపాయలు అంటూ ఆనందాన్ని పంచుకునే శీలా ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.

ఎం.ఎస్‌. చంద్రప్రభ నాయర్‌ కొన్నేళ్ల క్రితం తన తోబుట్టువులతో కలిసి పుట్టింటికి వెళ్లినప్పుడు, అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. తిరిగి ఇంటికి వచ్చాక ఏళ్లుగా పక్కన పడేసిన కుట్లు, అల్లికల పనిని తిరిగి కొనసాగించింది. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానుకగా ఇచ్చింది. ఆర్డర్లు వస్తుండటంతో దానినే వ్యాపారంగా మొదలుపెట్టింది. 
 

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)