Breaking News

వరల్డ్‌ బెస్ట్‌ లిస్ట్‌లో భారత ఫిల్టర్‌ కాఫీ

Published on Thu, 03/07/2024 - 16:02

కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్‌​ అండ్‌ ట్రామెల్‌ గైడ్‌ ఫ్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్‌ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్‌ ఎస్ప్రెసో అనేది డార్క్‌ రోస్ట్‌ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్‌లా ఉంటుంది.

కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్‌ టాప్‌ ఎస్ర్పెస్సో మేకర్‌లో లేదా ఎలక్ట్రిక్‌ ఎస్ప్రెస్సో మెషిన్‌లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్‌ కాఫీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది  నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ.

చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్‌ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్‌లో సర్వ్‌ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్‌ ఉంటుంది. సర్వ్‌ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్‌ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్‌ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే..

1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)
2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం)
3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్)
5. కాపుచినో (ఇటలీ)
6. టర్కిష్ కాఫీ (టర్కీయే)
7. రిస్ట్రెట్టో (ఇటలీ)
8. ఫ్రాప్పే (గ్రీస్)
9. ఐస్కాఫీ (జర్మనీ)
10. వియత్నామీస్ ఐస్‌డ్ కాఫీ (వియత్నాం)

(చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)