Breaking News

ఈ సూప్‌ తయారీకి మూలం బ్రిటిష్‌ అధికారులట..!

Published on Thu, 12/05/2024 - 13:03

దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్'  రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్‌ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్‌ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్‌ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్‌ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్‌ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్‌ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్‌ తయారీకి కారణమయ్యారంటే..

ముల్లిగటావ్నీ సూప్ని బ్రిటిష్‌ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్‌(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే. 

ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్‌ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్‌ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్‌ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్‌ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్‌లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్‌ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు. 

తయారీ విధానం
తేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్‌ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్‌ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే  భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్‌ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.

(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!)

 

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)