Breaking News

సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం ఇదే..!

Published on Thu, 01/23/2025 - 13:11

ప్రముఖ మోడల్‌, నటి సోనాలి బింద్రే(Sonali Bendre) తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెకు బాలీవుడ్‌ నటిగానే ఎక్కువగా గుర్తింపు లభించింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు హిందీలోనే చేసింది. ఇక మన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి హిట్‌లతో ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అంతేగాదు సోనాలి అత్యంత అందమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అదీగాక చూడటానికి కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ఇంటర్వ్వూలో ఆమె గ్లామర్‌ రహస్యం(beauty secret) గురించి షేర్‌ చేసుకంది. తన మెరిసే చర్మం రహస్యం ఆ మొక్కేనని అంటోంది.. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే ఈ మొక్క ఔషధ గుణాలను అందరూ ఉపయోగించుకోవాలని చెబుతోంది. అదేంటో చూద్దామా..!.

ఐదు పదుల వయసులో అంతే గ్లామర్‌తో అభిమానులను ఫిదా చేస్తుంటారామె. ఆమె ముఖంలో ఉట్టిపడే కాంతి ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అంతలా చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు స్కిన్‌ కేర్‌ తీసుకుంటానని అన్నారు. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే వేప మొక్క తన మెరిసే చర్మానికి కారణమంటుంది. 

తాను రోజకి రెండసార్లు వేప ఉత్పత్తుల(Neem products)తో చర్మాన్ని శుభ్రపరుస్తానని అంటున్నారు. దీంతోపాటు తాను చేసే వ్యాయమం కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు. "మనం భారతీయులం కచ్చితంగా ఈ వేప మొక్క గుణాలను పిల్లలకు తెలియజేయాలి. ఈ మొక్కచేసే మాయాజాలం గురించి సవివరంగా చెప్పాలి. 

వేప చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. తేమ వాతావరణంలో ఉండే వాళ్లకు వేప చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను బ్యూటీ ప్రొడక్ట్‌(Beauty Products)లను ఎక్కవగా ఉపయోగించను తరచుగా మాత్రం ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బద్దకించను. అలాగే వీటి తోపాటు ఆర్యోగకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకుంటాను." అని  చెబుతున్నారు సోనాలి. 

వేపతో కలిగే లాభాల..

  • వేపని 'వండర్‌ హెర్బ్‌'గా చెబుతుంటారు. ఇది చర్మం, జుట్టు, రక్తం తదితర శరీర భాగాలన్నింటి శ్రేయస్సుకి సమర్థవంతమైనది. 

  • జీవశాస్త్రపరంగా దాదాపు 130 రకాలుగా ఉపయోగపడుతుందట. 

  • 2018లో ది హిమాలయ డ్రగ్‌ కంపెనీ వేప చర్మానికి ఒనగూర్చే ప్రయోజనాలు గురించి సవివరంగా వెల్లడించింది.

  • ఆయుర్వేదంలో వేప చాలా ప్రభావవంతమైన మొటిమల నివారిణి.

  • చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందట

  • అలాగే బ్లాక్/వైట్ హెడ్స్‌ని నివారిస్తుంది.

  • దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందట. 

  • దద్దుర్లు, కాలిన గాయాల తాలుకా ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. 

  • ముఖ్యంగా తేలికపాటి చర్మ సమస్యలను సమూలంగా నివారిస్తుందని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివారాలను వ్యక్తిగత వైద్య నిపుణలను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)