Breaking News

ఈ డివైజ్‌తో మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం..!

Published on Sun, 12/01/2024 - 11:24

మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్‌ లైట్‌ థెరపీ డివైస్‌’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్‌ హెడ్స్, వైట్‌ హెడ్స్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఈ డివైస్‌.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్‌ లేదా రెడ్‌ కలర్‌ అనే రెండు ఆప్షన్స్‌తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది. 

దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్‌  చేయాలన్నా, ఆఫ్‌ చేయాలన్నా ముందున్న బటన్‌ని ఒక సెకను  పాటు ప్రెస్‌ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్‌ని సుమారు 3 నిమిషాలు ఆన్‌ చేసి, ఆప్షన్‌ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్‌ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. 

ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్‌ జెల్‌ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్‌ హెడ్‌ని ఆనించి ఉంచితే ట్రీట్‌మెంట్‌ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్‌లకు ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్‌ ఫాలో అయ్యి ఆర్డర్‌ చేసుకోవడం ఉత్తమం. 

(చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్‌ చేశారా..!)

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)