Breaking News

శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్‌ తెలిస్తే షాకవుతారు!

Published on Tue, 04/01/2025 - 16:28

నటి,హీరో అక్కినేని నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ  గ్లామరస్ గౌనులో అయినా క్లాసిక్ చీరలో అయినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ బ్యూటీ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సాంప్రదాయ సౌందర్య సాధనాలే తన బ్యూటీ సిక్రెట్‌ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో   తాజాగా వెల్లడించింది.

వోగ్ బ్యూటీస్కోప్‌తో  సంభాషించిన  మేడ్ ఇన్ హెవెన్ యాక్టర్‌ శోభిత తన అందం రహస్యాలు, స్వీయ సంరక్షణకు సంబంధించి వివరాలను వెల్లడించింది.  అందంగా కనిపించడం మాత్రమే కాదు,ఆనందంగా ఉండటం  కూడా ముఖ్యమని  వివరించింది. స్వీయ సంరక్షణ, ఆత్మవిశ్వాసం  ముఖ్యమని నిజమైన అందం లోపలి నుండే వస్తుందని  తన నమ్మకని తెలిపింది.  

శోభిత అందం రహస్యాలు
తనదైన  అందాన్ని కాపాడుకునేందుకు  సింపుల్‌ ,ప్రభావవంతమైన పద్దుతులు పాటిస్తానని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన ,మృదువైన చర్మం కోసం వినియోగించే కొబ్బరి నూనె. అదే తన సీక్రెట్‌ అని చెప్పింది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే  కొబ్బరి నూనె బెస్ట్‌ ఆప్షన్‌ అని, కొబ్బరి నూనెతో చాలా సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని,  తనకు తీవ్రమైన మైగ్రేన్‌  వచ్చినపుడు ఇది నిజంగా  హెల్ప్‌ చేసిందని తెలిపింది. అలాగే కొద్దిగా కొబ్బరి నూనెను నీటితో కలిపి, స్ప్రే బాటిల్‌లో వేసి,  స్ప్రే  చేసుకుంటే, తన జుట్టు అణిగి ఉంటుందని చెప్పింది. అంతేకాదు దద్దుర్లు, చర్మం పొడిబారడం ఇలా ప్రతీదానికి కొబ్బరినూనె వాడతానని తెలిపింది.

పెదాలకు  నెయ్యికి మించింది మరేదీ లేదు 
వివిధ రకాల పెదవి ఉత్పత్తులపై విచ్చలవిడిగా ఖర్చు పెట్టే బదులు, నెయ్యి అంత గొప్ప మాయిశ్చరైజర్   లేదనీ, లిప్ బామ్, లైనర్, కాజల్  వాడినప్పటికీ, పొద్దున్నే తన పెదవులపై నెయ్యి రాసుకుంటానని శోభిత తెలిపింది. పగిలిపోయిన పెదాలకు ఇది తప్పమరేఖరీదైన లిప్‌మాస్క్‌లు పనిచేయవని వెల్లడించింది. షూటింగ్ రోజుల్లో తప్ప   భారీ మేకప్‌ లేకుండా, సాదా సీదాగానే ఉంటానని తెలిపింది. శోభిత తన లుక్స్ కి, నీలిరంగు ఇష్టపడతానని తెలిపింది.తన మానసిక స్థితిని ప్రకటించేలా మస్కారా, ఐషాడో, లిప్‌కలర్‌  అయినా బ్లూ రంగువే ఇష్టమని చెప్పుకొచ్చింది. 

చదవండి: అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్‌ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు

అందం -సమతుల్యత
అందం అంటే చర్మానికి తగ్గట్టుగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండటమే అని శోభిత విశ్వాసం.  ఖరీదైన పద్ధతులు, అధునాతన గాడ్జెట్‌ల ప్రపంచంలో కొత్త ట్రెండ్‌లను ఆనందిస్తూనే సాంప్రదాయ సౌందర్య చిట్కాలను పాటించడం తన స్టైల్‌ అని శోభిత తెలిపింది. 

చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ



  
  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)