Breaking News

చిన్న వయసులోనే రచయిత్రిగా స్నేహా దేశాయ్‌..!

Published on Sun, 08/17/2025 - 11:02

ఒకవైపు మెయిన్‌స్ట్రీమ్‌ టీవీ షోలు, మరోవైపు ‘మహారాజ్‌’ ‘లాపతా లేడీస్‌’లాంటి భిన్నమైన బాలీవుడ్‌ చిత్రాలతో చిన్న వయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకుంది స్నేహా దేశాయ్‌. గుజరాత్‌ నాటకరంగం నుంచి టీవీరంగంలోకి అడుగు పెట్టిన స్నేహ అప్పుడప్పుడు టీవీ షోలలో నటించినప్పటికీ రచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. 

ఎంతోమంది సీనియర్‌ రచయితల దగ్గర సహాయకురాలిగా పనిచేసింది. ‘మిసెస్‌ తెందూల్కర్‌’తో టీవీ రైటర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తరువాత రాసిన ‘ఆర్‌కే లక్ష్మణ్‌ కే దునియా’ ‘బిహా హమారీ బహు కా’లాంటి టీవీ షోలతో రైటర్‌గా పేరు తెచ్చుకుంది. ‘టీవీ అంటే అప్పుడే కాదు నాకు ఎప్పటికీ ఇష్టమే’ అని చెప్పే స్నేహ టీవీ కోసం ప్రతి నెల 56 ఎపిసోడ్‌లు రాసేది. గుజరాతీ ప్రాంతీయ టీవీకి రాస్తున్న స్నేహకు ‘మహారాజ్‌’ సినిమా అవకాశం వచ్చింది. దీనికి కారణం ‘మహారాజ్‌’ అనేది గుజరాతీ నేపథ్యం ఉన్న కథ. ఈ సినిమాకు స్నేహ రాసిన స్క్రీన్‌ప్లే ఆమిర్‌ఖాన్‌కు బాగా నచ్చింది. 

దీంతో ‘లా పతా లేడీస్‌’కు పనిచేసే అవకాశం వచ్చింది. బిప్లబ్‌ గోస్వామి రాసిన కథకు స్క్రీన్‌ప్లే రాయల్సిందిగా ఆమిర్‌ఖాన్‌ నుంచి పిలువు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘మహిళలు రాసేవి పురుషులు కూడా రాస్తారు. అయితే ఇద్దరి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. మహిళగా నా అనుభవాలు, ఆలోచనలు పురుషులతో భిన్నంగా ఉండడం అనేది సహజం. లాపతా లేడీస్‌లో ఎన్నో స్త్రీ పాత్రలు ఉంటాయి. ఒక మహిళగా ఆ పాత్రలను అర్థం చేసుకొని రాయడం నాకు సులువు అయింది’ అంటోంది స్నేహ దేశాయ్‌. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)