Breaking News

స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్‌! జెన్‌ జెడ్‌ స్టోరీ టెల్లర్స్‌కి అవకాశల వెల్లువ..

Published on Thu, 03/27/2025 - 12:11

భారతదేశంలోని కంటెంట్‌ క్రియేటర్లను శక్తిమంతం చేసేలా హైదరాబాద్‌లో తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్‌ను ప్రారంభించింది. ఇది లోకల్‌ టాలెంట్‌ని ప్రోత్సహించడమే గాక పరిశ్రమ సహకారాలతో కంటెంట్‌ క్రియేటర్ల తమ డిజిటల్‌ కథలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తుంది. అందులో భాగంగా స్నాప్‌ చాట్‌ హైదరాబాద్‌లోని ప్రముఖ క్రియేటర్‌ ఏజేన్సీలు టమాడా మీడియా, చాయ్‌బిస్కెట్ - ముటినీ, NRGY+, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

దీనివల్ల ప్రాంతీయ కంటెంట్‌ క్రియేటర్లకు మద్దతు లబించడమే గాక తదుపరి తరం ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఒక వేదిక అవుతుంది కూడా.  Savvy on Snap వంటి కంటెంట్ ఎనేబుల్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా, భాగస్వాములు తమ Snapchat కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయపడటానికి అవసరమైన స్నాప్‌ కన్సల్టింగ్‌ మద్దతు తోపాటు తగు వనరులను అందిస్తుంది. 

అంతేగాదు ఈ ప్లాట్‌ఫాం కంటెంట్‌క్రియేటర్లు లాభాలు ఆర్జించేలా రివార్డ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ క్రియేటర్లు తమ కథను  ప్రేక్షకులను నిమగ్నం చేసేలా నిర్మించడం అనేది కీలకం. అదే వారికి ఆదాయాలను తెచ్చిపెడుతుంది.  ఈ మేరకు స్నాప్ ఇంక్ డాట్‌ కంటెంట్‌, ఏఆర్‌ భాగస్వామ్యాల డైరెక్టర్‌ మాట్లాడుతూ..ఈ హైదరాబాద్‌ కంటెంట్‌ క్రియేటర్లకు నిలయం. ఇక్కడ మా మొట్టమొదటి Snapchat క్రియేటర్ కనెక్ట్ IPని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 

ఇది జెన్‌ జెడ్‌ క్రియేటర్లు, వినియోగదారులకు కేంద్రంగా మారుతుంది. ట్రెండ్‌కి తగ్గ దృశ్యామన కళ పట్టుకోవడం, కుటుంబల లేదా స్నేమితుల అంతర్గత ఇతి వృత్తంగా ఉన్నవి తదతరాలకు Snapchat పెద్దపీట వేస్తుంది. పాప్ సంస్కృతిలో ఇది సరికొత్త మార్పుకి సంకేతమవుతుంద. భారతదేశం అంతటా ఉన్న కంటెంట​్‌ క్రియేటర్లు ఈ స్నాప్‌చాట్‌ వేదికపై భాగస్వామ్యం అవుతారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను తామందిస్తామని చెప్పారు  సాకేత్ ఝా సౌరభ్.

స్నాప్‌చాట్‌లో నేచురల్ స్టార్ అరంగేట్రం
టాలీవుడ్‌ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత సందడి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తన మూవీ HIT: ది థర్డ్ కేస్ స్నాప్‌చాట్‌లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. అంతేగాదు స్నాప్‌చాట్ ఈ చిత్రం కోసం కొత్త మూవీ లెన్స్‌ను కూడా ప్రారంభించింది. 

ఈ ఇంటరాక్టివ్ AR లెన్స్ అభిమానులను యాక్షన్‌కు దగ్గరగా తీసుకువస్తుంది, పైగా సినీ ప్రపంచంలోకి అడుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. ఇక హీరో నాని మాట్లాడుతూ..కథ చెప్పడం ఎల్లప్పుడూ కనెక్ట్‌వ్‌గానే ఉంటుంది. యువ క్రియేటర్లు కథలు ఎలా చెబుతారు, తాజా ట్రెండ్‌ ఎలా ఉంటుంది తదితారాలు హైదరాబాద్‌ క్రియేటర్‌ కమ్యూనిటీతో తీసుకురావాలన్నా ఆలోచన బాగుంది. ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరింత అద్బుతంగా ఉంది. అంతేగాదు స్నాప్‌చాట్ ప్లాట్‌ఫామ్‌ క్రియేటర్లకు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయని అన్నారు.

చివరగా ఈ కార్యక్రమం నయని పావని, శ్వేత నాయుడు, నైనికా అనసురు, ప్రణవి, అనుష రత్నం వంటి 50 మందికి పైగా అగ్ర సృష్టికర్తలను టాలెంట్ ఏజెన్సీలు, బ్రాండ్‌లు, పరిశ్రమ భాగస్వాములు పాల్గన్నారు. నిపుణుల నేతృత్వంలోని చర్చలలో భాగంగా, తమడ మీడియా నుంచి రాహుల్ తమడ  క్రియేటర్‌ అనుభవాలు, వృద్ధి  స్నాప్‌చాట్‌లో విజయంపై అనుభవాలను పంచుకున్నారు. 

అయితే చాయ్‌బిస్కెట్ నుంచి అనురాగ్ స్నాప్‌లో చిత్రాల భాగస్వామ్యం గురించి నొక్కి చెప్పారు. అందుకు సంబంధించిన కీలక ఉదాహరణలు, విజయగాథలను హైలైట్ చేశారు. స్నాప్‌చాట్ సాధనాలు - లెన్సులు, స్పాట్‌లైట్, స్టోరీస్ - క్రియేటర్ల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ప్రేక్షకులను ఎలా నిమగ్నమయ్యేలా చేస్తాయో ఈ కార్యక్రమానికి హజరైనవారికి వివరించారు నిర్వాహకులు.

(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్‌ సెలబ్రేషన్‌..ఓ బిడ్డకు తల్లి అయితే తిప్పలు తప్పవు..!)

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)