నెట్టింట్లో... భద్రం బీ కేర్‌ఫుల్‌ 

Published on Tue, 02/11/2025 - 04:19

తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం  ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.

ఇంటర్‌నెట్‌ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...

‘సేఫర్‌ ఇంటర్‌నెట్‌ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘స్నాప్‌చాట్‌’ డిజిటల్‌ వెల్‌–బీయింగ్‌ ఇండెక్స్‌ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్‌ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.

మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్‌ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్‌లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.

మన దేశం హైయెస్ట్‌ డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్‌నెట్‌ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్‌ శ్రేయస్సు (డిజిటల్‌ వెల్‌–బీయింగ్‌)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ బ్లాక్‌మెయిల్‌ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్‌లైన్‌ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.

డిజిటల్‌ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్‌లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది.  ఈ సంవత్సరం సేఫర్‌ ఇంటర్‌నెట్‌ డేకి సంబంధించిన థీమ్‌... ‘టుగెదర్, ఫర్‌ ఎ బెటర్‌ ఇంటర్‌నెట్‌’.
 

Videos

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)