Breaking News

స్కిన్‌ గ్లో శాశ్వతంగా ఉండాలంటే..ఇలా చేయండి!

Published on Fri, 12/13/2024 - 10:12

చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్‌ ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్‌ అవుతుంటాయి. ముఖ్యంగా..  మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్‌లో ఫేషియల్స్‌ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్‌లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్‌ పీల్‌ చేయించుకుంటారు. కానీ, ట్రీట్‌మెంట్‌కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.

మచ్చలు తగ్గాలంటే..
నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్‌ రెమిడీస్‌ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్‌ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్‌.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

లేజర్‌ చికిత్స
మచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్‌ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం   పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి.  

ఇదీ చదవండి:  ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్‌
 

 ప్రొడక్ట్స్‌ .. అలెర్జీలు 
ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది  ప్రొడక్ట్‌ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్‌ ప్యాచ్‌ చేసుకోవాలి. చలికాలం  పొడి చర్మం గలవారికి స్కిన్‌ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి. 

చర్మం నిగారింపు, హెయిర్‌ సాఫ్ట్‌నెస్‌ కోసం పర్మనెంట్‌ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం,  పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి. 
– డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్‌

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)