Breaking News

Sirimanu Utsavam అంబరాన్నంటిన సిరిమాను సంబరం

Published on Wed, 06/04/2025 - 14:51

పార్వతీపురం టౌన్‌:  మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు.  

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు  
సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధారణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి.  

450 మందితో పోలీస్‌ బందోబస్తు  
పార్వతీపురం ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్‌ మార్గం గుండా మళ్లించారు. పోలీస్‌ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్‌బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్‌ సీఐ అప్పారావు పర్యవేక్షించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)