Breaking News

నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్‌ టిప్స్‌!

Published on Sat, 02/22/2025 - 10:01

ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్‌ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!

యాంటీ ఏజింగ్‌ టిప్స్‌లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్‌ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్‌ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్‌ అవుతుంది. 

ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని  చెక్‌ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!

సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు. 

ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్‌ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం.  

జంక్‌ ఫుడ్‌కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్‌ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి.  

మసాజ్‌: శారీరక ఆరోగ్యానికి మసాజ్‌ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్‌ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇదీ చదవండి: ఒక్క సోలార్‌ బోట్‌ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!

ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..
మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్‌గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)