amp pages | Sakshi

బిర్యానీ వండేటప్పుడు ఈ చిట్కా పాటించండి.. టేస్ట్‌ బావుంటుంది

Published on Wed, 11/15/2023 - 13:32

వంటింటి చిట్కాలు

► అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపా. ఈ పేస్టుని అవెన్‌లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్‌ కాయిల్స్, ఫ్యాన్‌ బ్లేడ్స్, లైట్స్‌ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్‌ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్‌తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్‌లో పేరుకుపోయిన మురికి, అవెన్‌ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది.

► పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి.

► మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.

► అన్నం మెత్తగా ఉడికినప్పుడు క్యారెట్‌ను అత్యంత సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.అప్పుడు అన్నం మరీ మెత్తగా అనిపించదు.

► పకోడి చేసేప్పుడు చేసేప్పుడు పిండిలో కాస్త నూనే మరియు చిటికెడు వంట సోడ కలిపితే పకోడిలు క్రిస్పీగా వస్తాయి.

► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా ఉండటమే కాకుండా రుచిగానూ ఉంటుంది.

► వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కాస్త ఇంగువ ఒక గుడ్డలో కట్టి వేస్తే వాటిని వేయించే సమయంలో మంచి వాసన రుచి ఉంటాయి.

► రసం తీసేసిన నిమ్మకాయలను, సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచం ఉప్పు కారం, బెల్లం వేసి పోపు వెయ్యండి. నోరూరించే ఇన్‌స్టంట్‌ నిమ్మకాయ పచ్చడి రెడీ.
 

Videos

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)