Breaking News

Interior Designs: వర్షాకాలం.. ఇంటి మేకోవర్‌ మార్చేయండి ఇలా

Published on Thu, 07/13/2023 - 16:29

మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్‌నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్‌ డిజైనర్స్‌ ఇచ్చే సూచనలు కొన్ని... 

► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్‌ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది. 
► ఈ కాలం వుడెన్‌ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్‌ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది. 



►  రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్‌ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్‌ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు!
► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్‌ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్‌ షేడ్స్, ఫ్లోర్‌ లేదా టేబుల్‌ ల్యాంప్‌లనూ ఎంచుకోవచ్చు. 



► గోడలకు వాల్‌ పేపర్‌ లేదా వాల్‌ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది.
► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్‌ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్‌ రోబ్‌లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి. 
► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్‌ రూమ్‌.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)