Breaking News

ఇంటి చిట్కాలతోనే కాంతివంతంగా మెరిసిపోవచ్చు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

Published on Thu, 09/14/2023 - 10:51

అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్‌ కేర్‌ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం.

కాంతిమంతమైన ముఖం కోసం....
►టమాటాను గుండ్రంగా కట్‌ చేసి ఒక ముక్కను తీసుకుని దానికి పంచదార అద్దాలి. తరువాత ఈ ముక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. తరువాత స్పూను శనగ పిండి, అరస్పూను అలోవెర జెల్, రెండు స్పూన్ల టమాటా రసం, అర స్పూను తేనె వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృత కణాలు, ట్యాన్‌ పోయి ముఖం కాంతిమంతమవుతుంది. 

► రెండు స్పూన్ల పాల‌లో, అర స్పూన్ తేనె క‌లిపి క‌ళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి. ఆ త‌ర్వాత కాసేపు వేళ్ల‌తో మెల్ల‌గా మ‌సాజ్ చేసుకోవాలి. ఇలా పడుకునేముందు ప్యాక్‌ వేసుకొని చల్లటి నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే డార్క్‌ సర్కిల్స్‌ తగ్గిపోతాయి.

► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది.

► ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్‌గా ఉపయోగించండి. ఇది స్కిట్‌టోన్‌ని పెంచుతుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)