Breaking News

గ్లోబల్ పాప్‌ స్టార్ జెన్నీ స్కిన్‌ కేర్ సీక్రెట్‌ : రెండే రెండు ముక్కల్లో!

Published on Thu, 01/30/2025 - 17:37

అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు.  కానీ అది అందరికీ సాధ్యం కాదు.  ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్‌ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్‌ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్‌ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్‌ లాంటి షైనింగ్‌ స్కిన్‌ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?

గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది.  బ్లాక్‌పింక్‌గా పేరొందిన జెన్సీ  మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్‌. అసలు ఆమె స్కిన్‌ టోన్‌ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి  కాదు.  అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.

చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?

జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్‌కేర్‌కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా  పెద్ద ఈవెంట్‌లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్‌ (ఐస్‌వాటర్‌లో ఫేస్‌ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్‌ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంది.  ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.

ఐస్ వాటర్ ట్రిక్
ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్  తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా  చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్‌ను స్కిన్‌కేర్ ప్రిపరేషన్ స్టెప్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్‌కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్‌  చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని  చెప్పింది.  తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.

హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్‌

జెన్నీ ఫేస్ మాస్క్‌లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్‌ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్‌లు, ముఖ్యంగా షీట్ మాస్క్‌లు, కొరియన్ స్కిన్‌కేర్‌లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.

డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్
జెన్నీ స్కిన్‌కేర్ రొటీన్‌లో  మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్‌స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్‌ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.

చదవండి: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ : తీసుకున్నోడికి తీసుకున్నంత!

స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్‌ఫోలియేషన్
జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్‌ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్‌) రొటీన్‌గా  ఆచరిస్తుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ పోర్స్‌ను ఓపెన్‌ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది.  అతిగా ఎక్స్‌ఫోలియేషన్ చేయడం వల్ల  చర్మ  ఆరోగ్యం దెబ్బతింటుంది.  కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది.  

ఐ క్రీమ్‌లు , సీరమ్‌లు
జెన్నీ స్కిన్‌కేర్ రొటీన్‌లో కీలకమైన భాగం ఐ క్రీమ్‌లు ,సీరమ్‌. ఐ క్రీమ్‌లు  ద్వారా కంటికింద మచ్చలు,  కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్‌ ద్వారా స్కిన్‌ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది.  వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు  తాగుతుంది. ఇక  కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్‌స్క్రీన్‌ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.

ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్‌ లవ్‌ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్‌!
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)