Breaking News

తాతయ్య కంటే మనవడికే బీపీ ఎక్కువ..

Published on Tue, 07/14/2026 - 13:25

యువతలో రక్తపోటు (హైపర్‌టెన్షన్) కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసు వారిలోనూ ఎక్కువగా బయటపడుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 19.4% మహిళలు, 22.1% పురుషులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ‘ఐసీఎమ్ఆర్’ అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరికి హైపర్‌టెన్షన్ ఉంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లేదా కిడ్నీ వ్యాధులు వచ్చే వరకు చాలామందికి తమకు బీపీ ఉందనే విషయమే తెలియడం లేదు.

అందుకే ఇంట్లోనే డిజిటల్ డివైజ్‌ల ద్వారా తరచూ బీపీని పరీక్షించుకోవాలని, వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ, తక్కువ ఉప్పు వాడకం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)