Breaking News

తైమూర్‌-అముర్‌ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్‌ స్టోరీ వైరల్‌

Published on Tue, 07/23/2024 - 16:23

పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే.  కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్‌ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.

రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు.  ఇందులో  భాగంగానే సైబీరియన్ పులి అమూర్‌కు, తైమూర్‌ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.

గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం,  కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు  వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం  లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్‌ కెమెరాల ఆధారంగా పార్క్‌ అధికారులు ప్రకటించారు.

2015లో తైమూర్‌ , అముర్‌ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది.   నేచర్‌ ఈజ్‌ అమేజింగ్‌ అనే ట్విటర్‌ ఖాతా ఈ ఫోటోను షేర్‌ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.

 

ఈ స్నేహం ఎలా జరిగింది?
మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు.  అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే  ఇవి స్నేహితులుగా మారాయని, ఇది  మిరాకిల్‌  అని పేర్కొన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)