Breaking News

అందాల మయూరం.. అంతులేని వయ్యారం!

Published on Mon, 06/22/2026 - 11:39

ప్రకృతి సృష్టించిన పక్షి జాతులలో అత్యంత సుందరమైన రూపం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘నెమలి’ మాత్రమే. నీలిరంగు గొంతు, వయ్యారాల నడక, పురివిప్పిన పించపు అందాలతో అడవి తల్లి ఒడిలో తిరుగాడే ఈ జాతీయ పక్షి సొగసులను వరి్ణంచడానికి మాటలు చాలవు.

వర్షం వచ్చే ముందు ‘క్యావ్‌.. క్యావ్‌..’ అంటూ వినసొంపైన స్వరంతో కూస్తూ, పించం విప్పి ఆ నెమలి చేసే నాట్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది.సరిగ్గా ఫొటోలో చూస్తున్నారే.. ఇదీ ఆ సుందర దృశ్యం!సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో, చెట్ల పొదల చాటున దాగుండే ఈ లక్ష్మీదేవి వాహనం.. కడప జిల్లా సిద్ధవటం పరిధిలోని లంకమల అభయారణ్యం ప్రధాన రహదారి సమీపంలో హఠాత్తుగా ప్రత్యక్షమైంది.

రాతి గోడపై రాజసం ఉట్టిపడేలా నిలబడి, పొడవైన పించాన్ని కిందకు వాల్చి, తలపై కిరీటం లాంటి నెమలి సిగతో పరిసరాలను ఎంతో గంభీరంగా వీక్షిస్తోంది. తన హావభావాలతో అడవి అందాలను మరింత రెట్టింపు చేస్తూ వయ్యారంగా నడుస్తున్న ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని మన ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించి పత్రికా పేజీల్లో బంధించింది. రహదారి వెంట వెళ్తున్న ప్రయాణికులు సైతం ఈ జాతీయ పక్షి వంపుసొంపులను చూసి కాసేపు మైమరచిపోయారు. - ఫొటోలు : ఎస్‌.కె.మొహమ్మద్‌ రఫీ, సాక్షి ఫోటో గ్రాఫర్, కడప

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)