Breaking News

తల్లిదండ్రులు... పొరుగువారు

Published on Thu, 09/19/2024 - 11:06

మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున  ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్‌ ఇష్టపడడు (దివ్య ఖుర్‌ ఆన్‌: 4:36) 

బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి.   పోరపొచ్చాలు  రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి.

 అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.

∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి. 

పొరుగున ఉన్న బంధువులు: పొరుగున  నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.

అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్‌ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున  నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.
– అబ్దుల్‌ రషీద్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)