Breaking News

ఈ చెట్టు...  ఆ నీళ్లు

Published on Mon, 02/16/2026 - 04:05

అది మంచి ఎండాకాలం. ఎండలు దంచేస్తున్నాయి. దరిదాపులలో నీడనిచ్చేందుకు ఒక చెట్టు కూడా లేదు. దాహం వేస్తోంది. నాలిక పిడచ గట్టుకు పోయింది. ఇంకా రెండు మైళ్ళు నడిస్తే ఊరు చేరుకుంటాను. అనుకుంటూ అలానే రొప్పుతూ, ఆయాసపడుతూ టవలు తలపై వేసుకొని నడుస్తున్నాడు ఆ వ్యక్తి. ఎండ నిప్పులు కక్కుతోంది. దూరాన ఓ చెట్టు కనపడితే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. గబ గబ అడుగులు  పెద్దగా వేసుకుంటూ అక్కడి కి చేరుకున్నాడు. 

ఓ పెద్ద కానుగ చెట్టు గుబురుగా ఉంది. రోడ్డంతా నీడ నిస్తుంది. ఆ చెట్టు చుట్టూ అరుగు కట్టారు. ఒకరిద్దరు అక్కడ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. చెట్టు కిందకు చేరగానే అలసట తీరింది. ‘అబ్బా ఎంత చల్లగా ఉంది. ఎవరో పుణ్యాత్ముడు వేసిన చెట్టు అనుకుని ‘ఆహా..ఆహా’ అంటూ చెట్టు కింద చూశాడు. ఓ కుండ కనిపించింది. వెంటనే వెళ్లి కాడ గరిటతో నీళ్ళు ముంచుకొని తాగాడు. ‘ఆహా ఎవరో పుణ్యాత్ముడు చల్లటి నీళ్ళు పెట్టాడు, ఇక్కడ చెట్టు నాటాడు’’ అనుకుంటూ అక్కడ విశ్రమిస్తుండగా ఓ వృద్ధురాలు ఆ కుండలో నీళ్ల పోస్తూ కనిపించింది.

ఇంతటి ఎండలో ఈమె ఎక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చింది... అనుకుంటూ ‘అవ్వా! ఇంతటి ఎండలో ఎక్కడ నుంచి నీళ్లు తెచ్చావు? ఈ వయసులో నీకు ఈ అవసరమేమిటి?’ అడిగాడు. అవ్వ నవ్వి ‘మీలాంటి వాళ్ళ దాహార్తి తీరుస్తున్నాను. అదే నా సేవ నాయన. ఇక్కడ దరి దాపులలో చెట్లు లేకపోతే మా ముసలోడు ఈ చెట్టు నాటాడు, అక్కడ బోరు వేసాడు. దారిన పోయే వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చుని చలట్లి నీళ్లు తాగుతూ సేద తీరుతున్నారు. నా కొడుకు..కూతురు ఈ చెట్టు ఆ నీళ్లే నాయనా’ అంటూ అవ్వ అక్కడినుంచి వెళ్ళింది. ‘మానవ సేవే మాధవ సేవ అంటే ఇదేనేమో’ అనుకుంటూ అక్కడ సేద తీరాడు ఆ వ్యక్తి.
            
– కనుమ ఎల్లారెడ్డి  

#

Tags : 1

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )