Breaking News

వయసుకే వృద్ధాప్యం.. !

Published on Tue, 01/28/2025 - 08:42

వయసుకే వృద్ధాప్యం..మనసుకు మాత్రం కాదు.. అన్నట్లు హుషారైన వాతావరణం అక్కడి వారి సొంతం. ఆట ఏదైనా సై అంటూ రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రతిభను చాటుతుంటారు హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని మోడల్‌కాలనీ సీనియర్‌ సిటిజన్స్‌. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీకి చెందిన సీనియర్‌ సిటిజన్స్‌ అంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతున్నారు. అలాంటి హుషారైన వేదికకు అసోసియేషన్‌ కార్యాలయం.. సీనియర్‌ సిటిజన్స్‌ ఆనందానికి నెలవైంది. 

వయస్సు మీద పడింది కదా.. అని ఏదో మూలన కూర్చోవడం ఒకప్పటి మాట. ఇక్కడ సీనియర్‌ సిటిజన్స్‌ మాత్రం ఆటలతో అదరగొట్టేస్తున్నారు. కేరమ్స్, చెస్‌ వంటి ఆటలతో మానసికోల్లాసం పొందడమే కాకుండా థ్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చాలా కుటుంబాల్లో తమవారంతా కార్యాలయాలకో, పిల్లలు స్కూళ్లకో, కళాశాలలకో వెళ్లిపోతుండగా.. సీనియర్‌ సిటిజన్స్‌ ఇక్కడికి వచ్చి ఎవరికి ఇష్టమైన గేమ్‌లో వారు ఆడుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. 

రెండు వేల పుస్తకాలతో.. 
ఆడుకునేవారు ఆడుకుంటుంటే.. మరికొందరు ఇక్కడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విజ్ఞాన సముపార్జన చేస్తుంటారు. సాహిత్యం, ఆధ్యాతి్మకం, హిస్టరీ.. ఇలా దాదాపు నాలుగు వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కాలనీవాసులు ఇంటికీ తీసుకెవెళ్లేందుకు కూడా అనుమతిస్తారు. 

అలాగే దినపత్రికలు, మ్యాగజైన్స్‌ చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ప్రతిరోజూ ఇక్కడికి నాలుగు రకాల పత్రికలతో పాటు వివిధ రకాల వీక్లీ మ్యాగజైన్స్‌ వస్తుంటాయి. వాటిని చదువుతూ ప్రపంచ విశేషాలను తెలపడమే కాదు.. ఇంటికెళ్లి తమ వారితో పంచుకుంటుంటారు. 

ఆటల పోటీల్లో.. 
జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్‌ 1 (సీనియర్‌ సిటిజన్స్‌ డే) సందర్భంగా ఆసరా కమిటీ సహకారంతో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని సీనియర్‌ సిటిజన్స్‌ పలు క్రీడాంశాల్లో పోటీ పడుతుంటారు. కేరంబోర్డు, చదరంగం, బ్రిస్క్‌ వాకింగ్, టగ్‌ ఆఫ్‌ వార్, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తారు. 

ఏడు పదులు దాటిన వయోధికులకు మోడల్‌కాలనీ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతియేటా సన్మానిస్తూ ఎప్పటికప్పుడు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. భవిష్యత్తు తరాలకు సీనియర్‌ సిటిజన్స్‌కు ఏవిధమైన గౌరవం, ఆప్యాయత చూపించాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుండడం విశేషం.  

ఆత్మాభిమానంతో బతకాలి.. 
ఏ సమాజంలో వృద్ధులు తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో మనుగడ సాగిస్తారో ఆ సమాజమే నాగిరిక సమాజం. ఆ సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ముందంజవేసి భావితరాలకు కరదీపికగా నిలుస్తుంది. ఇది ఒక భావన, ఆకాంక్ష, స్వప్నం. దీనిని సాకారం చేసుకోవాలంటే కలలో నుంచి ఇలలోకి రావాలి. నేటి సమాజంలోని వృద్ధుల స్థితిగతులను సామాజిక, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. 
– జేఎస్‌టీ శాయి, ప్రధాన కార్యదర్శి, మోడల్‌కాలనీ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)