Breaking News

అనుభవాలే పాఠాలుగా...

Published on Mon, 04/28/2025 - 04:17

జీవితంలో పైకి రావాలనుకున్న వారెవరికైనా ముందుగా తాము చేస్తున్న పని పట్ల, తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తమపట్ల తమకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అన్న నమ్మకం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. కావల్సినంత బలాన్నిస్తుంది. అందువల్ల జీవితంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా మనలో ఉన్న మన ఆత్మవిశ్వాసమే మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న విషయాన్ని 
గుర్తించాలి.

తమ లక్ష్యాలను సాధించి జీవితంలో విజయ బావుటా ఎగురవేసిన వారిని మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తుంటాం. వింటూ ఉంటాం. అయితే వారివారి విజయ గాధలలో ఆయా వ్యక్తుల సాఫల్యాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ఆ విజయం వెనుక సదరు వ్యక్తులు పడిన తపన, బాధలు, కష్టాలు,  కన్నీళ్ళు, అవరోధాల గురించి మనం పట్టించుకోం. 

నిజానికి ప్రతి విజయ గాధ వెనుక ఎన్నో అపజయాలు, మరెన్నో అవరోధాలు ఉంటాయని తెలుసుకోలేం. నేడు సమాజంలో ఉన్నత స్థితికి వచ్చిన ఏ వ్యక్తినైనా తీసుకోండి. వారి విజయం వెనుక వారెన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో తేటతెల్లమవుతుంది. ఎన్నో అపజయాలు, ఓటములు అనుభవించిన తరువాత గానీ, ఆయా వ్యక్తులకు  విజయం సిద్ధించలేదన్న విషయం బోధపడుతుంది. 

జీవితంలో ఎవ్వరైనా తాము అనుభవిస్తున్న, అనుభవించిన అవమానాలు, అపజయాలు, ఓటముల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి. ఆయా పాఠాలు నేర్పిన గుణపాఠాలను ఆత్మవిశ్వాసం ద్వారా అధిగమించాలి. తమమీద తాము విశ్వాసాన్ని పెంచుకుని అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్న వారే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధించగలరు. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆశావహుల ఆభరణమని తెలుసుకోవాలి. 

మనం చిన్నపుడు తాబేలు, కుందేలు కథ విని ఉంటాం. నిదానంగా, నెమ్మదిగా పరుగెత్తే తాబేలు, అత్యంత వేగంగా పరుగెత్తే కుందేలుతో పరుగెత్తి విజయం సాధించిందని ఆ కథ సారాంశం. మరి ఈ కథలో  తాబేలుకు విజయం వరించడానికి ప్రధానమైన కారణమే ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే వేగంగా కదలలేని తాబేలు, వేగంగా పరుగెత్తే కుందేలు తో పందెం కడుతుంది. 

ఎంత ఆత్మవిశ్వాసముంటే తాబేలు కుందేలుతో పోటీపడి గెలుస్తుంది. ఎంత అతి విశ్వాసముంటే, పోటీలో గెలిచే సామర్ధ్యమున్నా, కుందేలు విజయానికి దూరంగా ఉందన్న విషయం అవగతమవుతోంది. ఈ కథ ద్వారా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే, మన లక్ష్యాలను గమ్యాలను దూరం చేసే అతి విశ్వాసం పనికిరాదని తేటతెల్లమవుతుంది.

ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుదు అబ్రహాం లింకన్‌ జీవిత గాథ మనకు అవగతం చేస్తుంది. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి విజేతగా నిలిచిన గొప్ప వ్యాపారవేత్త కల్నల్‌ సాండర్స్‌. కనుక జీవితంలో విజేతగా నిలవాలనుకున్న ప్రతిఒక్కరూ కష్టాలకు నెరవకుండా, అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకి వెళితే విజయం తప్పక వరిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవాలి. 

– దాసరి దుర్గా ప్రసాద్‌

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)