‘ప’ చీమ ‘ఉ’ చీమ : సంసారం, వైరాగ్యం ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Thu, 09/25/2025 - 12:58

ఒక వ్యక్తి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకొని ‘బాబోయ్‌! ఈ స్తంభం నన్ను వదిలి పెట్టటం లేదండోయ్‌!’ అంటూ అరిచాడట. సంసారం కూడా ఇంతే. సంసారం మనల్ని పట్టుకున్న దనుకొంటారు చాలామంది. కానీ సంసారాన్నే మనం పట్టుకొని సతమత మవుతున్నామని గ్రహించరు. సంసారంలోని సారం తెలిస్తే ఎవరూ బాధపడరు. చావుపుట్టుకల తగలాటమే సంసార సారం. భార్యాబిడ్డలు, ఇల్లూవాకిలి, పొలమూ పుట్ర ఇవన్నీ సంసారమను కొంటున్నాం. ఇవన్నీ జనన మరణాల మధ్య రాగంతో ఏర్పాటు చేసుకొన్న సామగ్రి.

జనన మరణాత్మకమైన సంసారంలో రాగద్వేషాలు వదలి తామరాకుపై నీటిబొట్టు లాగా ఉండగలిగితే ఈ సంసారం మనిషినేమీ చేయదు. అలాకాక రాగద్వేషాలతో వీటన్నిటి మీద ఆసక్తి కలిగి ఉన్నంతకాలం అది మనల్ని పట్టుకున్నట్లనిపిస్తుంది. సరిగ్గా దీనికి ఉదాహరణే స్తంభాన్ని కౌగలించుకోవటం! వైరాగ్య భావం అలవాటు చేసుకుంటే సంసారంలో ఆసక్తి ఉండదు. వైరాగ్యం పొందే విధం కోసం సద్గ్రంథ పఠనం చేసి, గురూపదేశం పొందాలి. మనిషి సంసారాన్ని తానే వరించి తెచ్చుకొన్నాడు తప్ప అది పట్టుకోలేదు.

‘ఉ’ అనే చీమ ఉప్పుగట్టు మీదనే ఉంటూ ఉప్పే తింటుండేది. అలాగే ‘ప’ అనే చీమ పంచదార గుట్ట మీద ఉంటూ పంచదార తింటూండేది. ఒకసారి  ‘ప’ అనే చీమ ‘ఉ’ అనే చీమతో ‘మిత్రమా! కొంచెం పంచదార చవి చూడు. ఎంత తియ్యగా ఉంటుందో!’ అని అన్నది. సరే అలాగే అని కొద్దిగా పంచదార రుచి చూచి ‘అబ్బే! తియ్యగా ఉన్నట్లే లేదోయ్‌ మిత్రమా’ అంది ‘ఉ’ అనే చీమ. ‘అయితే ఒక పని చెయ్యి! నీ నోట్లో ఉప్పుకణాలున్నాయి. వాటిని పూర్తిగా ఉమ్మివేసెయ్యి. అప్పుడుగాని పంచదార రుచేమిటో నీకు తెలీదు’ అన్నది పంచదార చీమ.

‘అంతర్లవణమేవాస్తి బహిర్వమతుమే సఖా’ అనే సూక్తి ఈ విషయాన్నే సూచిస్తున్నది. ఈ మాదిరిగానే గుండెనిండా రాగద్వేషాలు, వ్యామోహాదులను నింపుకొని ఉన్నవానికి గురుబోధ ఎక్కడ ఎక్కుతుంది? వైరాగ్యం ఎలా కుదురుతుంది? వైరాగ్యం కుదరాలంటే అవన్నీ ముందు వదిలించుకోవాలి!

-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి 

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)