విజృంభిస్తున్న మంకీఫాక్స్‌..డబ్లుహెచ్‌ఓ మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ!

Published on Thu, 08/15/2024 - 12:47

ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్‌ వేగంగ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిది కూడా. డబ్ల్యూహెచ్‌ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్‌I తో ప్రారంభమై.. క్లాడ్‌Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు.

 ఇది ఇంతవరకు లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. 

దీంతోపాటు ప్రజల ప్రాణాలను కాపాడేలా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన  కూడా అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ అన్నారు. కాగా, ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత  మంకీఫాక్స్‌ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.

(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్‌ వేరేలెవెల్‌!)
 

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)