Breaking News

రెండో భగవద్గీత అనుగీత, ఆసక్తికర విషయాలు

Published on Fri, 05/30/2025 - 11:34

శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన రెండవ ప్రబోధం ‘అనుగీత.’ దీనిని భగవద్గీత సారాంశంగా చెప్పవచ్చు. కురు–పాండవ యుద్ధం తర్వాత ధర్మరాజు రాజ్య పాలన చేస్తూ ఉంటాడు. కృష్ణార్జునులు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నదులు, అడవులు, కొండలలో విహరిస్తూ కబుర్లు చెప్పుకునేవారు. ఒక రోజు కృష్ణునితో అర్జునుడు ‘యుద్ధానికి పూను కున్నప్పుడు నా మనసు కలతచెంది, నేను కుంగిపోయినప్పుడు నువ్వు తత్త్వ బోధకాలైన మహా వాక్యాలను నా మీద కరుణతో బోధించి యుద్ధా నికి సిద్ధం చేశావు. అప్పుడు ఆ మాటల సారాంశాన్ని మనసులో పదిలపరుచుకోలేక పోయాను. మరోసారి ఆ తత్వోపదేశాన్ని అనుగ్రహించ’ మని ప్రార్థించాడు.

యుద్ధ ప్రారంభంలో చెప్పినదే ‘భగవద్గీత’. మానవులు పూర్తిగా లౌకిక ప్రపంచంలో మునిగి, సంసార తాపత్రయం నుండి బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు అందులో నుంచి బయటపడి తరించటానికి భగవద్గీత 18 మెట్లు చూపిస్తుంది. ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క అధ్యాయం. ఇవి దైవా నికి దగ్గర చేస్తాయి. బ్రహ్మ విద్యను తెలిపే గీతా శ్లోకాలను యథాతథంగా పునరుక్తం చేయటం సాధ్యం కాదని తెలిపి, కృష్ణుడు వేరే పద్ధతిలో కొన్ని పాత్రల పరంగా ప్రతిపాదించాడు.

ఇందులో ‘బ్రాహ్మణ గీత’లో బ్రాహ్మణుడు, అతని భార్య సంభాషణ ద్వారా బ్రహ్మ విద్యా ప్రబోధకాలైన అంశాలను తెలిపాడు. ‘అధ్వర్య– యతి సంవాదం’లో యజ్ఞాలలో కెల్లా తపోయజ్ఞమే శ్రేష్ఠమని చెప్పాడు. గురు శిష్య సంవాద రూపంలో సత్వ గుణ సహాయంతో రజస్తమో గుణాలను జయించి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, సత్వాన్ని కూడ విడిచిపెట్టాలని చెప్పాడు. అశ్వమేధ పర్వంలో బోధించిన ఈ ‘అనుగీత’ గీతా తాత్పర్యమే! ఇది అర్జునునిలో ఆధ్యాత్మిక పరిణామాన్ని కలిగించటానికి ఉద్దేశించినది. ఇది చదివితే, మననం చేస్తే సకల మానవాళిలో ఆధ్యాత్మిక భావ వికాసం పెంపొందుతుంది.  
– డా.చెంగల్వ రామలక్ష్మి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)