Breaking News

వాట్‌! ఈజిప్టు మమ్మీ సాయంతో పురాతన కాలం నాటి సెంట్‌!

Published on Mon, 09/04/2023 - 17:16

ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్‌'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్‌లో వాడే సుగంధాన్నే తిరిగి  ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్‌ పురాత మమ్మీతో సెంట్‌ ఎలా?! అనే కదా!

వివరాల్లోకెళ్తే..మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్‌నే' అనే ఈజిప్షియన్‌ మహిళ మమ్మీఫికేషన్‌లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్‌నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు.

వాటిలో బీస్వాక్స్‌, ప్లాంట్‌ ఆయిల్‌, కొవ్వులు, బిటుమెన్‌, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్‌ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్‌ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్‌'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్‌'ని శాస్త్రవేత్తలు "సెంట్‌ ఆఫ్‌ ఎటర్నీటీ" లేదా "సెంట్‌ ఆఫ్‌ లైఫ్‌" అని పిలుస్తున్నారు. ఈ "సెన్‌ట్‌నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్‌ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు.

వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్‌ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్‌లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్‌ ఫెర్ఫ్యూమర్‌ కరోల్‌ కాల్వేజ్‌ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్‌లోని మోస్‌గార్డ్‌ మ్యాజియంలో ఈ సెంట్‌ బాటిల్‌ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్‌ మమ్మీల మమ్మీఫికేషన్‌కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది. 

(చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...)

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)