Breaking News

విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్‌!..సడెన్‌గా మర్డర్‌ కేసులో..

Published on Sun, 01/21/2024 - 16:54

అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్‌ టవర్‌’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్‌ యూనిక్‌ టవర్‌.  ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్‌ 5న స్వీడిష్‌ టూరిస్ట్‌ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది.  

2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్‌ టూరిస్ట్‌ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్‌ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్‌.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్‌ టూరిస్ట్‌ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్‌ టూరిస్ట్‌ జేబులో దొరికిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాయంతో నవంబర్‌ 10 థాయిలండ్‌కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు.

అతని కలే ఈ భవనం..
1990లో రంగ్సన్‌ టోర్సువాన్‌ అనే ప్రముఖ థాయ్‌ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్‌’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్‌ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్‌ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్‌ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్‌.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్‌.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్‌ డెత్‌ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్‌.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. 

దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్‌ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్‌ ఈ టవర్‌ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టేవారు.

కానీ స్వీడిష్‌ టూరిస్ట్‌ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్‌ టోర్సువాన్‌ వారసుడు పన్సిత్‌ టోర్సువాన్‌.. టవర్‌పైకి ఎక్కి ఆన్‌లైన్‌లో ఫొటోలు షేర్‌ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్‌ టూరిస్ట్‌ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే!
∙సంహిత నిమ్మన 

(చదవండి: అక్కడ కవి పుట్టిన​ రోజు ‘బర్న్స్‌ నైట్‌’ పేరుతో ఓ పండుగలా ..!)

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)