Breaking News

చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!

Published on Tue, 10/01/2024 - 17:08

చీరకట్టు చిరాకేం కాదు... చక్కదనానికి కేరాఫ్‌ అడ్రస్‌ అని నిరూపిస్తూ బెంగళూరులో శారీరన్‌ను నిర్వహించింది టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్‌ విభాగం తనైరా. 2,500 మంది మహిళలు పాలుపంచుకున్న ఈ శారీ రన్‌లో వయసు తారతమ్యాలేవీ లేకుండా రంగు రంగుల, రకరకాల చీరలు ధరించిన మహిళామణులు చీరకట్టులోని సొగసును, పొందికను చీరకట్టు అందాన్ని గర్వంగా, హుందాగా ప్రదర్శించారు. 

బెంగళూరుకు చెందిన టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్‌ విభాగం తనైరా, జేజే యాక్టివ్‌ సంస్థలు ఆదివారం సంయుక్తంగా ఈ శారీరన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తనైరా సీఈవో అంబుజ్‌ నారాయణ్, జేజే యాక్టివ్‌ కోచ్‌ ప్రమోద్‌ ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా అంబుజ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ...‘చీరను స్త్రీత్వానికి, స్త్రీసాధికారతకు ముఖ్యంగా భారతీయతకు బలమైన, చైతన్యవంతమైన భావనకు ప్రతీకగా తనైరా భావిస్తుంది. 

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని చీరను డిజైన్‌ చేయడం మాకెంతో ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ శారీరన్‌ కార్యక్రమం కేవలం చీర, చీరకట్టు రమ్యతను గురించి తెలియజేసేందుకు మాత్రమే కాదు అధునిక జీవన విధానానికి అనుగుణంగా మా నిబద్ధతను పునర్నిర్వచించుకోవడం కోసం కూడా. 

సంప్రదాయ చీరకట్టులోనూ చైతన్యవంతంగా, చురుగ్గా కనిపించవచ్చుననీ, తమ అస్తిత్వాన్ని వదులుకోకుండానే మనసుకు నచ్చినట్లుగా కూడా జీవించవచ్చునన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలన్నదే ఈ శారీరన్‌ను నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అలాగే చీరకట్టు అనేది సాంస్కృతిక వారసత్వానికి, శక్తి సామర్థ్యాలకు వెన్నుదన్ను అని మా విశ్వాసం, నమ్మకం కూడా. చిన్న స్థాయిలో స్థానికంగా మొదలైన మా కార్యక్రమం నేడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారటం సంతోషంగా ఉంది’’ అన్నారు అంబుజ్‌ నారాయణ్‌. 

(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్‌ ఫేమస్‌ వటకం..!)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)