Breaking News

ఆమె శారద

Published on Wed, 01/28/2026 - 00:41

‘ఊర్వశి’ శారద (80) చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదీ తెలుగు నేలలో కాదు. కేరళలోని తిరువనంతపురంలో. ఆదివారం అక్కడ ఘనంగా జరిగిన ‘కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ (2024) బహూకరణ వేడుకలో ఆమె కరతాళధ్వనుల మధ్య వీల్‌చైర్‌లో వేదిక మీదకు వచ్చారు. ప్రసిద్ధ నటుడు మమ్ముట్టి చేయి అందించగా లేచి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా ఆ రాష్ట్ర సర్వోన్నత సినీ పురస్కారం ‘జె.సి.డేనియల్‌’ అవార్డు అందుకున్నారు. మనకు రçఘుపతి వెంకయ్యనాయుడు ఎలాగో అక్కడ జె.సి.డేనియల్‌ అలాగ. జె.సి. డేనియల్‌ తొలి మలయాళ సినిమా దర్శకుడు.

1965 నుంచి శారద మలయాళ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. 2015 వరకూ ఆమె నటన కొనసాగింది. ‘శారద మలయాళ రంగానికి మొదటి జాతీయ అవార్డు తీసుకు వచ్చారు. ఆమె మలయాళ రంగానికి చేసిన సేవలు విశిష్టమైనవి. ఆమె తన లోతైన, నిండైన అభినయంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు’ అని పినరయి విజయన్‌ శారద నటనను కొనియాడారు. శారద మలయాళంలో 125 చిత్రాలలో నటించారు. ‘తులాభారం’ (1968) మలయాళ చిత్రానికి ఆమె మొదటి జాతీయ అవార్డు తీసుకున్నారు. ఈ సినిమా తెలుగులో ఆమె ముఖ్యపాత్రగా ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్‌ అయ్యింది. శారద ఆ వెంటనే ‘స్వయంవరం’ (1972) మలయాళ సినిమాతో మరోసారి జాతీయ అవార్డు గెలిచారు.

అదూర్‌ గోపాల కృష్ణన్‌ దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమా మలయాళంలో పార్లల్‌ సినిమాకు మొదటి అడుగుగా వ్యాఖ్యానిస్తారు. ఆ తర్వాత శారద ‘నిమజ్జనం’ (1977) తెలుగు సినిమాతో మూడోసారి జాతీయ అవార్డు గెలిచారు అందుకే ఆమెకు జె.సి.డేనియల్‌ అవార్డుతో పాటు ఐదు లక్షల నగదును అందించారు. శారద ఈ సందర్భంగా తను నటించిన మలయాళ చిత్రంలోని పాట పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

తెలుగులో ఆమె ‘శారద’, ‘బలిపీఠం’, ‘కార్తీక దీపం’, ‘న్యాయం కావాలి’, ‘జస్టిస్‌ చౌదరి’ తదితర ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్‌ రాసిన ‘ప్రతిధ్వని’, ‘లారీ డ్రైవర్‌’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ తదితర చిత్రాల పాత్రలలో నటించారు. నటుడు బాలకృష్ణకు ‘అత్తగారి’ పాత్రలో ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనసూయమ్మ గారి అల్లుడు’ తదితర చిత్రాలలో అలరించారు. ‘అమ్మ రాజీనామా’ చిత్రం ఆమె నటనకు మరో కలికితురాయి. ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో నివసిస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి