Breaking News

మిస్‌ అలబామాగా ప్లస్‌ సైజ్‌ మోడల్‌..!

Published on Wed, 06/12/2024 - 12:11

అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్‌ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్‌ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది. 

సోషల్‌ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్‌. 

సారా మెంటల్‌ హెల్త్‌ లాయర్‌(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యింది. సోషల్‌మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్‌​ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్‌ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్‌కి దూరంగా ఉంది. 

మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని  మిస్‌ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా. 

మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్‌ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్‌ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్‌ మీడీయా ట్రోల్స్‌కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్‌లైన్‌లో టైప్‌ చేసే బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్‌ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్‌ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. 

(చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్‌ చేస్తే 15 ఏళ్ల తర్వాత)
 

#

Tags : 1

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)