Breaking News

సంకటాలు తొలగించే ‘చతుర్థి’

Published on Sun, 08/02/2026 - 11:36

సంకష్టహర చతుర్థనే సంకట హర చతుర్థి అని కూడా అంటారు. ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినా న్ని సంకష్టహర చతుర్థగా పిలుస్తా రు. ఈరోజున గణపతి పూజలు, నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి లాగానే ప్రతినెలాలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకోవడం వ ల్ల భరించలేని కష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు తొ లగిపోతాయని, సుఖశాంతులు, సిరిసంపదలు పొందుతామని భక్తులకు నమ్మకం. 

అలాగే మంగళవారం వచ్చే ‘అంగారక చతుర్థి’ విశిష్టమైనదిగా భా విస్తారు. ఈ ఏడాది జనవరి, మే నెలలో మంగళవా రం వచ్చింది. సెపె్టంబర్‌ 29న మరోసారి మంగళవారం రానుంది. ఈరోజు ఉపవాసం ఉంటే 21 సంకష్ట చతుర్థులు చేసిన ఫలితం వస్తుందని నమ్ము తారు. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో దైవాన్ని పూజిస్తే కుజదోషం పోతుందని పెద్దలు చెబుతారు.  

తెల్లవారుజామునుంచే.. 
మహిళలు ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు అలికి, వాకిలికి పసుపు రాసి, గడపకు మామిడాకుల తోరణం కడతారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. మధ్యాహ్నం గణపతి ప్రతిమను అలంకరించి, పూజలు చేస్తారు.‘ఉండ్రాళ్లు’ నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల గారెలు కూడా చేస్తారు. అనంతరం ‘సంకష్టహర గణపతి వ్రత కథ’ చదువుకుంటారు. కథ అయిపోయాక చంద్రుడి దర్శనం చేసుకొని, మహిళలు ఉపవాసం విరమిస్తారు.   

గణపయ్యే సంకటాలు తొలగిస్తాడు.. 
మా కుటుంబం కోసం 11 సంకష్టహర చతుర్థి ఉపవాసాలు చేస్తానని మొక్కుకున్నాను. చతుర్థి రోజున చంద్రుడు వచ్చేదాకా పిల్లలతో కథ చెప్పుకుంటూ కూర్చుంటే ఆకలి కూడా తెల్వదు. గణపయ్య అన్ని సంకటాలు తొలగిస్తాడనే ధైర్యం. 
–కదం సంధ్యారాణి, ఆర్మూర్‌

40 ఏళ్లుగా పూజ చేస్తున్నా.. 
సంకటహర చతుర్థి పూజలు 40 సంవత్సరాలుగా చేస్తున్నా. భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పూజాఫలం చక్కగా ఉంటుంది. మా ఇంటి చుట్టుపక్కల వారు సాయంత్రం ప్రసాదం కోసం ఇంటికి వస్తారు. పండుగ అంటే అందరిదీ అనే ఫీలింగ్‌ ఇస్తుంది. 
–జంగం నాగమణి, ఆర్మూర్‌  

మనసుకు ప్రశాంతత.. 
చతుర్థి రోజున ఫోన్‌ పక్క న పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడి పూజ చేసుకుంటా. ఉండ్రాళ్లు చేయడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా. ఆ రోజు ఉపవాసం వల్ల శరీరం డిటాక్స్‌ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 
–దాసరి అనిత, ఆర్మూర్‌  

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి