Breaking News

దక్షిణ భారత వంటకం 'సాంబార్‌'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

Published on Wed, 02/12/2025 - 17:46

దక్షిణ భారత వంటకం సాంబార్‌ ఎంత ఫేమస్‌ రెసిపీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలోకే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ అది ఉండాల్సిందే. అలాంటి ఈ రెసిపీ తయారీని ఎవరు కనుగొన్నారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా..

దేశవ్యాప్తంగా బాలీవుడ్‌ మూవీ చావా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అందిరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక రాజు శంభాజీ మహారాజ్‌ పైనే ఉంది. ఆ మూవీలో మరాఠా రాజు శంభాజీ రాజు పాత్రలో హీరో విక్కీ కౌశల్‌ ఒదిగిపోయాడు. ఇక్కడ చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఆ శంభాజీ మహారాజు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు ఆధారంగా తీసిన సినిమా ఇది. 

అయితే  ఆ మహారాజు పేరు మీదనే దక్షిణ భారత వంటకం ఉంది. ఆ మరాఠా పాలకుడి పేరు మీదగానే సాంబార్‌ అనే రెసిపీ వచ్చిందట. దాదాపు 400 ఏళ్ల క్రితం తంజావూరు రాజ వంటగదిలో తయారయ్యిందట. ఆహారప్రియుడైన రాజు శంభాజీకి మహారాష్ట్ర వంటకం అమీ(పుల్లని పప్పు) అంటే చాలా ఇష్టం. దీన్ని కోకుమ్‌ అనే పుల్లని పండుతో తయారు చేస్తారు. అయితే ఒకరోజు కోకుమ్‌ అయిపోయింది. 

వంటగదిలో ఉన్న వంటవాళ్లు ఎలా వండాలతో తెలియక ఆందోళనకు గురవ్వుతారు. అప్పుడే ఆ విషయాన్ని వణికిపోతు మహారాజుకి విన్నవించుకుంటారు. అప్పుడు శంభాజీ స్థానికంగా దొరికే చింతపండుతో ఎందుకు తయారు చేయకూడదు అని అన్నారు. అలా ఆయన సూచన మేరకు కందిపప్పు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయరు చేయగా దానికి శంభాజీ మహారాజు పేరుమీదుగా సాంబార్‌ అని పేరు పెట్టారని కథనం. 

అయితే దక్షిణ భారతదేశంలో మరొక కథనం ప్రకారం శ్రీ కృష్ణుడు కొడుకు సాంబుడి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడని. ఆ వ్యాధి తగ్గాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలని మునులు చెప్పడంతో రోజుకో నైవేద్యం చేసే నివేదించేవాడట. ఆ క్రమంలోనే ఇలా కందిపప్పు, కూరగాయలతో చేసిన వంటకం సూర్యుడికి నివేదించగా..ఆయన ప్రీతి చెంది సాంబుడికి వ్యాధిని నయం చేశాడని చెబుతారు. 

అలా ఆయన పేరు మీదుగా సాంబర్‌ వంటకం వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే మరాఠా మూలం నుంచి వచ్చిందంటే కొందరూ పాక నిపుణులు ఎందుకనో అంగీకరించారు. ఏదీఏమైనా ఈ రుచికరమైన వంటకాన్ని తమిళులు మునగకాయలతో చేసుకోగా మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేక మసాలాతో తయారు చేస్తారు. ఇక కేరళ వాళ్లు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి చేస్తారు. ప్రస్తుతం ఈ రెసిపీ మనలో భాగమైపోయింది.

(చదవండి: కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..)

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)